Appada numtim goba maampa lenu

అప్పట నుంటిఁ గోప మాఁప లేను
Language

(॥పల్లవి॥)
అప్పట నుంటిఁ గోప మాఁప లేను
వొప్పుగ నీవే నాకు వొడఁబఁడ జెప్పరా

(॥అప్పట॥)
మేఁటి వై నీవొక్కఁడవే మేడమీఁద నుండితిని
ఆఁటది మాఁటలాడిని ట్టాయ నందు
యేఁటికి బొంకేవు నాతో యెవ్వతెఁ దెచ్చితి వోరి
నాఁటకుఁడ నా మనసు నమ్మించరా

(॥అప్పట॥)
నిద్దిరించి పానుపుపై నీవే యంటా నుంటి
యిద్దరుఁ బవళించినయిర వున్నది
వద్దురా మరఁగు నాతో వనిత నెందు దాఁచితి
గద్దరీఁడ నాలోని కలఁ కెల్లఁ బాపరా

(॥అప్పట॥)
కాఁగిటిలో నీవు నేనుఁ గలసితి మిద్దరము
రేఁగి నీ మేనిపై వింతరేక లున్నవి
దాఁగ నీ పనులు నేఁడు దక్కితి శ్రీవెంకటేశ
పాఁగినజాణఁడ నాతోఁ బలికి మెప్పించరా

(||pallavi||)
appaḍa nuṁṭim̐ goba mām̐pa lenu
vŏppuga nīve nāgu vŏḍam̐bam̐ḍa jĕpparā

(||appaḍa||)
mem̐ṭi vai nīvŏkkam̐ḍave meḍamīm̐da nuṁḍidini
ām̐ṭadi mām̐ṭalāḍini ṭṭāya naṁdu
yem̐ṭigi bŏṁkevu nādo yĕvvadĕm̐ dĕchchidi vori
nām̐ṭagum̐ḍa nā manasu nammiṁcharā

(||appaḍa||)
niddiriṁchi pānububai nīve yaṁṭā nuṁṭi
yiddarum̐ bavaḽiṁchinayira vunnadi
vaddurā maram̐gu nādo vanida nĕṁdu dām̐sidi
gaddarīm̐ḍa nāloni kalam̐ kĕllam̐ bābarā

(||appaḍa||)
kām̐giḍilo nīvu nenum̐ galasidi middaramu
rem̐gi nī menibai viṁtarega lunnavi
dām̐ga nī panulu nem̐ḍu dakkidi śhrīvĕṁkaḍeśha
pām̐ginajāṇam̐ḍa nādom̐ baligi mĕppiṁcharā