అనుచు రావణుసేన లటు భ్రమయుచు వీఁగె
(॥పల్లవి॥)
అనుచు రావణుసేన లటు భ్రమయుచు వీఁగె
యినకులచంద్ర నేఁ డిదిగో నీ మహిమ
(॥అనుచు॥)
దదదద దదదద దశరథ తనయా
కదిసితిఁ గకకక కావవే
అదె వచ్చె బాణాలు హా నాథ హా నాథ
పదపద పదపద పారరో పవుంజులూ
(॥అనుచు॥)
మమమమ్మ మమమమ్మ మన్నించుఁడు కపులార
సమరాన చచచచ్చ చావకుండా
మెమెమెమ్మె మెమెమెమ్మె మేము నీ వారమె
మొమొమొమ్మొ మొమొమొమ్మొ మొక్కేము మీకు
(॥అనుచు॥)
తెతెతెత్తె తెతెతెత్తె తెరు వేది లంకకు
తతతత్త తలమని దాఁగుదురూ
గతియైన శ్రీ వేంకటగిరి రఘునాథ
సతమై మమ్మింక నేలు జయ జయ నీకు
(||pallavi||)
anusu rāvaṇusena laḍu bhramayusu vīm̐gĕ
yinagulasaṁdra nem̐ ḍidigo nī mahima
(||anusu||)
dadadada dadadada daśharatha tanayā
kadisidim̐ gagakaga kāvave
adĕ vachchĕ bāṇālu hā nātha hā nātha
padabada padabada pāraro pavuṁjulū
(||anusu||)
mamamamma mamamamma manniṁchum̐ḍu kabulāra
samarāna sasachachcha sāvaguṁḍā
mĕmĕmĕmmĕ mĕmĕmĕmmĕ memu nī vāramĕ
mŏmŏmŏmmŏ mŏmŏmŏmmŏ mŏkkemu mīgu
(||anusu||)
tĕdĕtĕttĕ tĕdĕtĕttĕ tĕru vedi laṁkagu
tadatatta talamani dām̐gudurū
gadiyaina śhrī veṁkaḍagiri raghunātha
sadamai mammiṁka nelu jaya jaya nīgu