Anusu niddarunaade ramadalavalene

అనుచు నిద్దరునాడే రమడలవలెనే
Language

(॥పల్లవి॥)
అనుచు నిద్దరునాడే రమడలవలెనే
మొనసి యివెల్లాఁ జూచి మొక్కిరి బ్రహ్మాదులు

(॥అను॥)
రాముఁడ పండ్లు నాకు రండు వెట్టరా
యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు
ప్రేమపుతమ్ముఁడఁ గాన పిన్ననే నీకు
యీమాట మఱవకు యిందిరాకృష్ణుఁడా

(॥అను॥)
యెక్కిన వుట్టిపై నన్ను నెక్కించరా వోరి
వుక్కునఁ బడేవు రాకు వద్దురా నీవు
పక్కున మొక్కేరా నీపయిఁడికాళ్ళకు వోరి
అక్కతోఁ జెప్పేఁ గాని అందుకొనే రారా

(॥అను॥)
యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి
నివ్వటిల్ల నీవింత నిక్కవొద్దురా
రవ్వల శ్రీవేంకటాద్రిరాయఁడనేరా అయితే-
యివ్వల నీకంటేఁ బెద్ద యిది నీ వెఱఁగవా

(||pallavi||)
anusu niddarunāḍe ramaḍalavalĕne
mŏnasi yivĕllām̐ jūsi mŏkkiri brahmādulu

(||anu||)
rāmum̐ḍa paṁḍlu nāgu raṁḍu vĕṭṭarā
yemirā yiṭlānĕ nāgu yittuvā nīvu
premabudammum̐ḍam̐ gāna pinnane nīgu
yīmāḍa maṟavagu yiṁdirākṛṣhṇum̐ḍā

(||anu||)
yĕkkina vuṭṭibai nannu nĕkkiṁcharā vori
vukkunam̐ baḍevu rāgu vaddurā nīvu
pakkuna mŏkkerā nībayim̐ḍigāḽḽagu vori
akkadom̐ jĕppem̐ gāni aṁdugŏne rārā

(||anu||)
yĕvvaru vŏḍavo sari niḍu niludamurā vori
nivvaḍilla nīviṁta nikkavŏddurā
ravvala śhrīveṁkaḍādrirāyam̐ḍanerā ayide-
yivvala nīgaṁṭem̐ bĕdda yidi nī vĕṟam̐gavā