Anumaanimchaga maado naanadeevayyaa

అనుమానించక మాతో నానతీవయ్యా
Language

(॥పల్లవి॥)
అనుమానించక మాతో నానతీవయ్యా
పెనఁగి వారి పొందులు పెడరేఁతునా

(॥అను॥)
చెనకి నవ్వినయాపె చేరి పుస్తరించుఁ గాక
పనిమాలి వేఁడుకోను పరులకేల
మనసు దిగ వేసుక మంతనాన నున్నాఁడవు
మునుపటి సతికే ఇమ్ములనే చెప్పుదునా

(॥అను॥)
తిట్టినట్టి యాపె నిన్ను దీవించవలెఁగాక
కట్టఁ గడవారు మొక్కఁగా గారణమేల
వట్టి వేసటతోఁ దలవంచుక నీ వున్నాఁడవు
రట్టు సేసినతివనే ఇట్టె రప్పింతునా

(॥అను॥)
కాలు దొక్కినాపె నిన్ను కాఁగిలించుకొనుగాక
యేల పొరుగువారికి నింతేసి పని
యీలీల శ్రీ వేంకటేశ ఇటు నన్నుఁగూడితివి
ములనున్న తొంటి ఇంతిమొకము చూపింతునా

(||pallavi||)
anumāniṁchaga mādo nānadīvayyā
pĕnam̐gi vāri pŏṁdulu pĕḍarem̐tunā

(||anu||)
sĕnagi navvinayābĕ seri pustariṁchum̐ gāga
panimāli vem̐ḍugonu parulagela
manasu diga vesuga maṁtanāna nunnām̐ḍavu
munubaḍi sadige immulane sĕppudunā

(||anu||)
tiṭṭinaṭṭi yābĕ ninnu dīviṁchavalĕm̐gāga
kaṭṭam̐ gaḍavāru mŏkkam̐gā gāraṇamela
vaṭṭi vesaḍadom̐ dalavaṁchuga nī vunnām̐ḍavu
raṭṭu sesinadivane iṭṭĕ rappiṁtunā

(||anu||)
kālu dŏkkinābĕ ninnu kām̐giliṁchugŏnugāga
yela pŏruguvārigi niṁtesi pani
yīlīla śhrī veṁkaḍeśha iḍu nannum̐gūḍidivi
mulanunna tŏṁṭi iṁtimŏgamu sūbiṁtunā