Anumaanaa limkanela amparaadaa nee

అనుమానా లిఁకనేల అంపరాదా నీ
Language

(॥పల్లవి॥)
అనుమానా లిఁకనేల అంపరాదా నీ-
మనసు దెలిసితిమి మమ్ము నంపరాదా

(॥అను॥)
చెలిమాఁట విన్నపము సేసితిమి నీ చిత్త-
మలరఁగ నానతిచ్చి అంపరాదా
బలిమి సేయఁగరాదు పట్టరాదు నిన్ను నేము
మలకలమాఁటలేల మమ్ము నంపరాదా

(॥అను॥)
ఆకె నీవు నెదురైతి రండనున్నారము నేము
ఆకొలఁది నీవెఱఁగి యంపరాదా
యేకతాన యిద్దరునే యెఱుఁగుకొందరు గాని
మాకతలు యిప్పుడేల మమ్ము నంపరాదా

(॥అను॥)
మంచముపై నున్నారు మారుమోము లవి యేల
అంచెల శ్రీవేంకటేశ అంపరాదా
మించుల దోమతెరలో మేనుమేను సోఁకె మీకు
మంచిదాయ నిట్టె వుండి మమ్ము నంపరాదా

(||pallavi||)
anumānā lim̐kanela aṁparādā nī-
manasu dĕlisidimi mammu naṁparādā

(||anu||)
sĕlimām̐ṭa vinnabamu sesidimi nī sitta-
malaram̐ga nānadichchi aṁparādā
balimi seyam̐garādu paṭṭarādu ninnu nemu
malagalamām̐ṭalela mammu naṁparādā

(||anu||)
āgĕ nīvu nĕduraidi raṁḍanunnāramu nemu
āgŏlam̐di nīvĕṟam̐gi yaṁparādā
yegadāna yiddarune yĕṟum̐gugŏṁdaru gāni
māgadalu yippuḍela mammu naṁparādā

(||anu||)
maṁchamubai nunnāru mārumomu lavi yela
aṁchĕla śhrīveṁkaḍeśha aṁparādā
miṁchula domadĕralo menumenu som̐kĕ mīgu
maṁchidāya niṭṭĕ vuṁḍi mammu naṁparādā