Anumaana mimkanela amkevachche neevela

అనుమాన మిఁకనేల అంకెవచ్చె నీవేళ
Language

(॥పల్లవి॥)
అనుమాన మిఁకనేల అంకెవచ్చె నీవేళ
వొనరి ఇట్టె వద్దనుండవయ్యా

(॥అను॥)
కోపమెల్లాఁ జల్లవారె కూరిమికి నోరూరె
రాపులఁ బెట్టక యిట్టె రావయ్యా
తీపులు మోములు నిండె దిష్టమైన వలపు పండె
యేపున నీచేత విడె మియ్య వయ్యా

(॥అను॥)
సెలవుల నవ్వు వచ్చె చెక్కిళ్లఁ జెమట హెచ్చె
చెలరేఁగి మా మొక్కులు చేకొనవయ్య
నిలువు నివ్వెరగందె నీకు నా విన్నపమందె
పిలిచి రతిఁ జొక్కించేఁ బెనఁగకువయ్యా

(॥అను॥)
చనుల చంద్రులు నిక్కె సమరతు లివె దక్కె
మనసెల్లాఁ గంటి మిఁక మన్నించవయ్యా
ననిచె శ్రీ వేంకటేశ నాకు నీకుఁ బోదిఁక
యెనసితి మిద్దరము యిరవుకోవయ్యా

(||pallavi||)
anumāna mim̐kanela aṁkĕvachchĕ nīveḽa
vŏnari iṭṭĕ vaddanuṁḍavayyā

(||anu||)
kobamĕllām̐ jallavārĕ kūrimigi norūrĕ
rābulam̐ bĕṭṭaga yiṭṭĕ rāvayyā
tībulu momulu niṁḍĕ diṣhṭamaina valabu paṁḍĕ
yebuna nīseda viḍĕ miyya vayyā

(||anu||)
sĕlavula navvu vachchĕ sĕkkiḽlam̐ jĕmaḍa hĕchchĕ
sĕlarem̐gi mā mŏkkulu segŏnavayya
niluvu nivvĕragaṁdĕ nīgu nā vinnabamaṁdĕ
pilisi radim̐ jŏkkiṁchem̐ bĕnam̐gaguvayyā

(||anu||)
sanula saṁdrulu nikkĕ samaradu livĕ dakkĕ
manasĕllām̐ gaṁṭi mim̐ka manniṁchavayyā
nanisĕ śhrī veṁkaḍeśha nāgu nīgum̐ bodim̐ka
yĕnasidi middaramu yiravugovayyā