Anugonam gaani needo namdarivale

అనుకొనఁ గాని నీతో నందరివలె
Language

(॥పల్లవి॥)
అనుకొనఁ గాని నీతో నందరివలె
వినయములేనిది వెలఁదా యది

(॥॥)
పంతములాడుకొనేది పలుమారు నవ్వేది
అంతరువెరిఁగినట్టి యాఁటదా యది
వంతులకుఁ బెనఁగేది వాసులకుఁ దిరిగేది
కాంతుని ఇచ్చయెరిఁగేకామినా యది

(॥॥)
వేసాలఁ బొరలేది వెంగెములు నెరుపేది
నేసవెట్టి పెండ్లాడిన చెలియా యది
బాస సేయించుకొనేది బలుములు చూపేది
దోసానకు వెరచిన తొయ్యలా యది

(॥॥)
ఱట్టడియై మెరసేది పట్టి రచ్చకుఁ దీసేది
గుట్టుగలిగినయట్టికోమలా యది
ఇట్టె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
మట్టై ఇఁక మెచ్చకుంటే మగువా యది

(||pallavi||)
anugŏnam̐ gāni nīdo naṁdarivalĕ
vinayamulenidi vĕlam̐dā yadi

(||||)
paṁtamulāḍugŏnedi palumāru navvedi
aṁtaruvĕrim̐ginaṭṭi yām̐ṭadā yadi
vaṁtulagum̐ bĕnam̐gedi vāsulagum̐ dirigedi
kāṁtuni ichchayĕrim̐gegāminā yadi

(||||)
vesālam̐ bŏraledi vĕṁgĕmulu nĕrubedi
nesavĕṭṭi pĕṁḍlāḍina sĕliyā yadi
bāsa seyiṁchugŏnedi balumulu sūbedi
dosānagu vĕrasina tŏyyalā yadi

(||||)
ṟaṭṭaḍiyai mĕrasedi paṭṭi rachchagum̐ dīsedi
guṭṭugaliginayaṭṭigomalā yadi
iṭṭĕ śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
maṭṭai im̐ka mĕchchaguṁṭe maguvā yadi