Anniyunum danaaasaaryaadheenamu

అన్నియునుఁ దన‌ఆచార్యాధీనము
Language

(॥పల్లవి॥)
అన్నియునుఁ దన‌ఆచార్యాధీనము
చెన్నుమీఱ హరిపాదసేవ సేయు మనసా

(॥అన్ని॥)
దైవమూఁ గొంచము గాఁడు తానూ గొంచము గాఁడు
భావించి కొలచేవారి పరిపాటి
చేవలఁ బత్తిముదుగు చేనిముదుగూ లేదు
వావిరిఁ బోఁగెత్తేటి వారివారి నేరుపు

(॥అన్ని॥)
కాలము కడమలేదు కర్మము కడమ లేదు
కేలి విశ్వాసము గలిగిన పాటి
వ్రాలకు ముదిమీ లేదు వక్కణ ముదిమీ లేదు
పోలించేటి విద్వాంసుల బుద్ధిలోని నేరుపు

(॥అన్ని॥)
జ్ఞానానకుఁ దప్పులేదు జన్మానకుఁ దప్పులేదు
నానాటికి వివేకించి నడచేపాటి
పానిపట్టి శ్రీవేంకటపతి యింతకు మూలము
ఆనుక యీతని శరణనేవారి నేరుపు

(||pallavi||)
anniyunum̐ dana‌āsāryādhīnamu
sĕnnumīṟa haribādaseva seyu manasā

(||anni||)
daivamūm̐ gŏṁchamu gām̐ḍu tānū gŏṁchamu gām̐ḍu
bhāviṁchi kŏlasevāri paribāḍi
sevalam̐ battimudugu senimudugū ledu
vāvirim̐ bom̐gĕtteḍi vārivāri nerubu

(||anni||)
kālamu kaḍamaledu karmamu kaḍama ledu
keli viśhvāsamu galigina pāḍi
vrālagu mudimī ledu vakkaṇa mudimī ledu
poliṁcheḍi vidvāṁsula buddhiloni nerubu

(||anni||)
jñānānagum̐ dappuledu janmānagum̐ dappuledu
nānāḍigi vivegiṁchi naḍasebāḍi
pānibaṭṭi śhrīveṁkaḍabadi yiṁtagu mūlamu
ānuga yīdani śharaṇanevāri nerubu