అన్నియును నొక్కజాడే యనవచ్చునా
(॥పల్లవి॥)
అన్నియును నొక్కజాడే యనవచ్చునా
కన్నుల పండువగాఁ గనవలెఁగాక
(॥అన్ని॥)
సన్నమాయ నెన్నడును చన్నుదోయిఘనమాయ
కన్నియ కీరెండు నంగములేకావా
యెన్ననేల యిందులోనేయెచ్చుకుందులాయనంటా
పన్నిన వారివారి భాగ్య మింతేకాక
(॥అన్ని॥)
నవ్వులు దెలుపులాయ నలుపాయ కనుచూపు
జవ్వనిమేనివిలాసములే కావా
యెవ్వరి కేమనవచ్చు ఇందుకుఁగా మనమున
నొవ్వులేల తా మున్ను నోచినంతేకాక
(॥అన్ని॥)
చెదరెఁ గెంపుల మోవి చెక్కులెల్లఁ జీరలాయ
ముదితపలుకులకు ముంగిలేకాదా
వెదచల్లె మచ్చిక శ్రీవేంకటేశుఁడిదె కూడె
మదనుఁడు సేసినట్టిమాయ లివి గాక
(||pallavi||)
anniyunu nŏkkajāḍe yanavachchunā
kannula paṁḍuvagām̐ ganavalĕm̐gāga
(||anni||)
sannamāya nĕnnaḍunu sannudoyighanamāya
kanniya kīrĕṁḍu naṁgamulegāvā
yĕnnanela yiṁduloneyĕchchuguṁdulāyanaṁṭā
pannina vārivāri bhāgya miṁtegāga
(||anni||)
navvulu dĕlubulāya nalubāya kanusūbu
javvanimenivilāsamule kāvā
yĕvvari kemanavachchu iṁdugum̐gā manamuna
nŏvvulela tā munnu nosinaṁtegāga
(||anni||)
sĕdarĕm̐ gĕṁpula movi sĕkkulĕllam̐ jīralāya
mudidabalugulagu muṁgilegādā
vĕdasallĕ machchiga śhrīveṁkaḍeśhum̐ḍidĕ kūḍĕ
madanum̐ḍu sesinaṭṭimāya livi gāga