అన్నియును హరి సేసే యటమటాలే యివి
(॥పల్లవి॥)
అన్నియును హరి సేసే యటమటాలే యివి
పన్నిన సుజ్ఞానికి బయలై తోఁచు
(॥అన్ని॥)
తిరుపై యవ్వలవ్వలఁ దిరుగుచుండేటివేళఁ
దిరిగినట్లనుండు దిక్కులెల్లాను
సిరుల సంసారభ్రమఁ జిక్కిన జీవునికిని
పరగ నైహికమే పరమై తోఁచు
(॥అన్ని॥)
సొగసి యద్దమునీడ చూచినవేళఁ దనకు
మగుడ వేఱొకరూపు మతిఁ దోఁచును
తగిలి యిట్లానేపో తనుఁదా నెఱఁగకున్న
నిగిడిన పుట్టువులు నిజమై తోఁచు
(॥అన్ని॥)
కదిసిన సకలాంధకార మంతటాఁ గప్పి
వుదయమైతే నన్నీ నొదిగినట్టు
హృదయపు శ్రీవేంకటేశుఁడు వెల్లవిరైతే
మదిలో నజ్ఞానము మాయమై తోఁచు
(||pallavi||)
anniyunu hari sese yaḍamaḍāle yivi
pannina sujñānigi bayalai tom̐su
(||anni||)
tirubai yavvalavvalam̐ dirugusuṁḍeḍiveḽam̐
diriginaṭlanuṁḍu dikkulĕllānu
sirula saṁsārabhramam̐ jikkina jīvunigini
paraga naihigame paramai tom̐su
(||anni||)
sŏgasi yaddamunīḍa sūsinaveḽam̐ danagu
maguḍa veṟŏgarūbu madim̐ dom̐sunu
tagili yiṭlānebo tanum̐dā nĕṟam̐gagunna
nigiḍina puṭṭuvulu nijamai tom̐su
(||anni||)
kadisina sagalāṁdhagāra maṁtaḍām̐ gappi
vudayamaide nannī nŏdiginaṭṭu
hṛdayabu śhrīveṁkaḍeśhum̐ḍu vĕllaviraide
madilo najñānamu māyamai tom̐su