అన్నియుఁ జూతురుగాని యట్టె వుండరే
(॥పల్లవి॥)
అన్నియుఁ జూతురుగాని యట్టె వుండరే
సన్న లాతఁ డెఱుఁగు వేసారకురే
(॥అన్ని॥)
నీతులుగాఁ భోహణించి నే విన్నవించేది
ఆతఁడే యెఱుఁగునే అంగనలాల
రాతిరిఁబగలు నాడ రచ్చ లెంత సేసినాను
ఆతుమ యిక్కడ గుండు నాతనికిని
(॥అన్ని॥)
యీడనేఁ గానుక మీచే నిచ్చి పంపేదెల్లాను
ఆడ నాతనిచే నున్న దతివలాల
చేడెలు పదివేగురు సేవలు సేసినాను
వేడుకెల్లా నామీఁదిదే విభునికిని
(॥అన్ని॥)
కదిసి శ్రీవేంకటేశుకడకుఁ బోయేమనఁగ
అదె యాఁతడే వచ్చెనే అక్కలాల
అడ నెఱిఁగి కలసె నందరికంటె నాపై-
నెదుగా వలపుగద్దే యీతనికిని
(||pallavi||)
anniyum̐ jūdurugāni yaṭṭĕ vuṁḍare
sanna lādam̐ ḍĕṟum̐gu vesāragure
(||anni||)
nīdulugām̐ bhohaṇiṁchi ne vinnaviṁchedi
ādam̐ḍe yĕṟum̐gune aṁganalāla
rādirim̐bagalu nāḍa rachcha lĕṁta sesinānu
āduma yikkaḍa guṁḍu nādanigini
(||anni||)
yīḍanem̐ gānuga mīse nichchi paṁpedĕllānu
āḍa nādanise nunna dadivalāla
seḍĕlu padiveguru sevalu sesinānu
veḍugĕllā nāmīm̐dide vibhunigini
(||anni||)
kadisi śhrīveṁkaḍeśhugaḍagum̐ boyemanam̐ga
adĕ yām̐taḍe vachchĕne akkalāla
aḍa nĕṟim̐gi kalasĕ naṁdarigaṁṭĕ nābai-
nĕdugā valabugadde yīdanigini