అన్నియుఁ జేసినఫల మదియె మాకు
(॥పల్లవి॥)
అన్నియుఁ జేసినఫల మదియె మాకు
విన్నపము లిందుమీఁద వేవేలు నేఁటికి
(॥॥)
కప్పుర మంపఁగనేలే కడమా నాకిది తొల్లి
కప్పుర గందినవుట కానఁడా తాను
కప్పురముపేర నుండి కాఁకసేసే వెరబొమ్మఁ
జిప్పిలి మమ్మేపకుండాఁ జేయుమనవే
(॥॥)
చందన మే లంపెనే సహజాన నేఁ దొల్లి
చందనగందినవుట చాటువే కాదా
చందనపుఁగొండఁ బుట్టి చల్లజంపు దిప్పకాయ
అంది పచ్చిరేఁచకుండా నడ్డపెట్టు మనవే
(॥॥)
కమలము లే లంపెఁ గానుకగా నేఁ దొల్లి
కమలగందినవుట కలదేకదే
కలమలాక్షుఁడైన శ్రీవేంకటపతి దానె నేఁడు
అమరఁగఁ గూడె నన్ను నండ నుండుమనవే
(||pallavi||)
anniyum̐ jesinaphala madiyĕ māgu
vinnabamu liṁdumīm̐da vevelu nem̐ṭigi
(||||)
kappura maṁpam̐ganele kaḍamā nāgidi tŏlli
kappura gaṁdinavuḍa kānam̐ḍā tānu
kappuramubera nuṁḍi kām̐kasese vĕrabŏmmam̐
jippili mammebaguṁḍām̐ jeyumanave
(||||)
saṁdana me laṁpĕne sahajāna nem̐ dŏlli
saṁdanagaṁdinavuḍa sāḍuve kādā
saṁdanabum̐gŏṁḍam̐ buṭṭi sallajaṁpu dippagāya
aṁdi pachchirem̐saguṁḍā naḍḍabĕṭṭu manave
(||||)
kamalamu le laṁpĕm̐ gānugagā nem̐ dŏlli
kamalagaṁdinavuḍa kaladegade
kalamalākṣhum̐ḍaina śhrīveṁkaḍabadi dānĕ nem̐ḍu
amaram̐gam̐ gūḍĕ nannu naṁḍa nuṁḍumanave