Anniyum jakkanayyeeni amdugemilevayya

అన్నియుఁ జక్కనయ్యీని అందుకేమిలేవయ్య
Language

(॥పల్లవి॥)
అన్నియుఁ జక్కనయ్యీని అందుకేమిలేవయ్య
నున్నని వలపే కాదా నూఁగులెక్కెఁ గాక

(॥అన్ని॥)
సారె నీవాడె వెల్లా చల్లనిమాటనే కావా
వేరేసతులఁ గూడఁగ వేఁడాయఁ గాక
మేరతో నవ్వేదెల్లా మించువెన్నెలలే కావా
యీరనపువారివల్ల యెండలాయ గాక

(॥అన్ని॥)
మక్కువ నీనిలువెల్లా మంచితనమే కాదా
వెక్కసానఁ దిరుగఁగ వెట్టాయఁగాక
పక్కున నీమోవెల్లాఁ బచ్చితేనెలే కావా
వుక్కపలుసోఁకులను వొగరాయఁగాక

(॥అన్ని॥)
కందువ నీకాఁగిలెల్లా కామనిధానమే కాదా
అందునిందు నంటుముట్టు లాయఁగాక
విందువలె నన్నును శ్రీవేంకటేశ కూడితివి
సందడి నన్నిటివల్లాఁ జవులాయఁగాక

(||pallavi||)
anniyum̐ jakkanayyīni aṁdugemilevayya
nunnani valabe kādā nūm̐gulĕkkĕm̐ gāga

(||anni||)
sārĕ nīvāḍĕ vĕllā sallanimāḍane kāvā
veresadulam̐ gūḍam̐ga vem̐ḍāyam̐ gāga
merado navvedĕllā miṁchuvĕnnĕlale kāvā
yīranabuvārivalla yĕṁḍalāya gāga

(||anni||)
makkuva nīniluvĕllā maṁchidaname kādā
vĕkkasānam̐ dirugam̐ga vĕṭṭāyam̐gāga
pakkuna nīmovĕllām̐ bachchidenĕle kāvā
vukkabalusom̐kulanu vŏgarāyam̐gāga

(||anni||)
kaṁduva nīgām̐gilĕllā kāmanidhāname kādā
aṁduniṁdu naṁṭumuṭṭu lāyam̐gāga
viṁduvalĕ nannunu śhrīveṁkaḍeśha kūḍidivi
saṁdaḍi nanniḍivallām̐ javulāyam̐gāga