Anniyum jakkajaadala nadigem gaaga

అన్నియుఁ జక్కజాడల నడిగేఁ గాక
Language

(॥పల్లవి॥)
అన్నియుఁ జక్కజాడల నడిగేఁ గాక
కన్నుల నన్నేల కడు గద్దించేరే చెలులు

(॥అన్ని॥)
మేర మీర కాతనితో మెచ్చుగా మాటలాడేను
వూరకుండరాదా మీ రొకరొకరే
యీరీతి నాతని నే నేమైనాఁ దిట్టితినా
వోరియంటినా కాక వోడై నాఁ బట్టతినా

(॥అన్ని॥)
సన్నల నాతనివాదు చాయలకు దిద్దేను
నన్నుఁ జూడరాదా కొంత నవ్వుతానే
చిన్ననై ఆతనిమీఁద చేతులు చాఁచితినా
వెన్నె లివేడ వంటినా వేగిరపడితినా

(॥అన్ని॥)
కరఁగించి యాతని నే కాఁగిటనే కూడేను
తరవులఁ బెట్టకు రే దగ్గర మీరు
అరుదై శ్రీవేంకటేశుఁ డాతఁడె నన్నుఁ గలసె
వరుస లడిగితినా వావులు చెప్పితినా

(||pallavi||)
anniyum̐ jakkajāḍala naḍigem̐ gāga
kannula nannela kaḍu gaddiṁchere sĕlulu

(||anni||)
mera mīra kādanido mĕchchugā māḍalāḍenu
vūraguṁḍarādā mī rŏgarŏgare
yīrīdi nādani ne nemainām̐ diṭṭidinā
voriyaṁṭinā kāga voḍai nām̐ baṭṭadinā

(||anni||)
sannala nādanivādu sāyalagu diddenu
nannum̐ jūḍarādā kŏṁta navvudāne
sinnanai ādanimīm̐da sedulu sām̐sidinā
vĕnnĕ liveḍa vaṁṭinā vegirabaḍidinā

(||anni||)
karam̐giṁchi yādani ne kām̐giḍane kūḍenu
taravulam̐ bĕṭṭagu re daggara mīru
arudai śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍĕ nannum̐ galasĕ
varusa laḍigidinā vāvulu sĕppidinā