Anniyum goodamgaanu alamelumamgayaaya

అన్నియుఁ గూడఁగాను అలమేలుమంగయాయ
Language

(॥పల్లవి॥)
అన్నియుఁ గూడఁగాను అలమేలుమంగయాయ
కన్నుల నిట్టికొత్తలు కనుఁగొనవయ్యా

(॥॥)
చిగురుమరుకాళెలు జిగిగలయరఁటులు
సొగసైనయట్టి యిసుకదిబ్బలు
తగినబిలము మంచితరఁగలు సింహము
మొగిచినచక్రవాళములపిల్లలు

(॥॥)
జవళితామరతూండ్లు చక్కనిశంఖము పోఁ క
పవడాలు వజ్రాలు పసిడియద్దాలు
నువుఁ బూవు కలువలు నూలుకొన్న శ్రీకారాలు
అవిరళమైనవిండ్లు అరచంద్రుఁడూ

(॥॥)
తమ్మివిరి నీలాలు తళుకుమెఱుఁగులు
తమ్మిదలుఁ బెదరనితోరపుగుంపు
ఇమ్ముల శ్రీ వేంకటేశ యిదె నీవురముమీఁద
నెమ్మదిఁ దావుకొని నిండెను యీసిరులు

(||pallavi||)
anniyum̐ gūḍam̐gānu alamelumaṁgayāya
kannula niṭṭigŏttalu kanum̐gŏnavayyā

(||||)
sigurumarugāḽĕlu jigigalayaram̐ṭulu
sŏgasainayaṭṭi yisugadibbalu
taginabilamu maṁchidaram̐galu siṁhamu
mŏgisinasakravāḽamulabillalu

(||||)
javaḽidāmaradūṁḍlu sakkaniśhaṁkhamu pom̐ ka
pavaḍālu vajrālu pasiḍiyaddālu
nuvum̐ būvu kaluvalu nūlugŏnna śhrīgārālu
aviraḽamainaviṁḍlu arasaṁdrum̐ḍū

(||||)
tammiviri nīlālu taḽugumĕṟum̐gulu
tammidalum̐ bĕdaranidorabuguṁpu
immula śhrī veṁkaḍeśha yidĕ nīvuramumīm̐da
nĕmmadim̐ dāvugŏni niṁḍĕnu yīsirulu