అన్నియుఁ గనేఁ గాక అప్పటి నేను
(॥పల్లవి॥)
అన్నియుఁ గనేఁ గాక అప్పటి నేను
యెన్నరాని వేడుకల నెందు వోయే నేనూ
(॥॥)
అతి వేషముల నీవు అన లెల్లాఁ బెట్టు కోఁ గా
పతి మాటలాడ నాకుఁ బంతమా నీతో
జతనాన నీ గుణము చక్క నుంటేఁ జాలుఁ గాక
గతి నీవే అది నా భాగ్యము గాదా
(॥॥)
తగవు లుపచరించి తారుకాణకు రాఁ గాను
జగడించ నాకు నేఁడు చలమా నీతో
వగదీర నీవె నావద్ద నుంటేఁ జాలుఁ గాక
తెగని నాపాలిటి దేవరవు గావా
(॥॥)
మచ్చిక కౌఁగిటి నించి మంచ మెక్కు మనఁగాను
హెచ్చి నిన్ను దోయఁగ నే నెదురా నీతో
అచ్చమై శ్రీ వేంకటేశ అట్టే నన్నుఁ గూడితివి
కొచ్చి కొచ్చి నేఁ గోరిన కోరి కిదే కాదా.
(||pallavi||)
anniyum̐ ganem̐ gāga appaḍi nenu
yĕnnarāni veḍugala nĕṁdu voye nenū
(||||)
adi veṣhamula nīvu ana lĕllām̐ bĕṭṭu kom̐ gā
padi māḍalāḍa nāgum̐ baṁtamā nīdo
jadanāna nī guṇamu sakka nuṁṭem̐ jālum̐ gāga
gadi nīve adi nā bhāgyamu gādā
(||||)
tagavu lubasariṁchi tārugāṇagu rām̐ gānu
jagaḍiṁcha nāgu nem̐ḍu salamā nīdo
vagadīra nīvĕ nāvadda nuṁṭem̐ jālum̐ gāga
tĕgani nābāliḍi devaravu gāvā
(||||)
machchiga kaum̐giḍi niṁchi maṁcha mĕkku manam̐gānu
hĕchchi ninnu doyam̐ga ne nĕdurā nīdo
achchamai śhrī veṁkaḍeśha aṭṭe nannum̐ gūḍidivi
kŏchchi kŏchchi nem̐ gorina kori kide kādā.