అన్నియుఁ గావలసిన ట్టయ్యీఁ గాని
(॥పల్లవి॥)
అన్నియుఁ గావలసిన ట్టయ్యీఁ గాని
యెన్నికగా మమ్ము నంపు యేల నవ్వే విఁకను
(॥అన్నియు॥)
ఆనుక నీ వాడినట్టే ఆపెతో నే విన్నవించే
వీనుల నీ మాట లెల్ల వింటిఁగా నేను
కానుకగాఁ బట్టె మయ్య కాంతకు నీ సరితెలు
యీ నిజాలె చెల్లించుకో యేల నవ్వే విఁకను
(॥అన్నియు॥)
అక్కడనే పనులు అందాలుగాఁ జేసి వచ్చే
గక్కన నీ చేఁత లెల్లఁ గంటిఁ గా నేను
పెక్కు నీవినయములు బిందెల నించే నాపెకు
యిక్కడనే వుండవయ్య యేల నవ్వే విఁకను
(॥అన్నియు॥)
తీపులు గా నీరాక తేట తెల్లములు సేసే
నాపెకు నీకు లో నైతిఁ గా నేను
యేపున శ్రీవెంకటేశ యిద్దరిఁ గూడించితిని
యేప నైనా నాన తీ నీ వేల నవ్వే విఁకను
(||pallavi||)
anniyum̐ gāvalasina ṭṭayyīm̐ gāni
yĕnnigagā mammu naṁpu yela navve vim̐kanu
(||anniyu||)
ānuga nī vāḍinaṭṭe ābĕdo ne vinnaviṁche
vīnula nī māḍa lĕlla viṁṭim̐gā nenu
kānugagām̐ baṭṭĕ mayya kāṁtagu nī saridĕlu
yī nijālĕ sĕlliṁchugo yela navve vim̐kanu
(||anniyu||)
akkaḍane panulu aṁdālugām̐ jesi vachche
gakkana nī sem̐ta lĕllam̐ gaṁṭim̐ gā nenu
pĕkku nīvinayamulu biṁdĕla niṁche nābĕgu
yikkaḍane vuṁḍavayya yela navve vim̐kanu
(||anniyu||)
tībulu gā nīrāga teḍa tĕllamulu sese
nābĕgu nīgu lo naidim̐ gā nenu
yebuna śhrīvĕṁkaḍeśha yiddarim̐ gūḍiṁchidini
yeba nainā nāna tī nī vela navve vim̐kanu