Anniyum delisinave amdarunu

అన్నియుఁ దెలిసినవే అందరును
Language

(॥పల్లవి॥)
అన్నియుఁ దెలిసినవే అందరును
వెన్నలో నేతివంటిది వేడుక నీ ప్రియము

(॥॥)
మొక్కలాన నాకె నిన్ను మోత నొకమాటాడితే
వెక్కసములాడేవు వేమారును
మక్కువ మీ ఇద్దరికి మాటలే వాండ్లుగాని
లక్కవంటి వెంచిచూడ లవి మీ మనసులు

(॥॥)
చిట్టకాన కాపె నీపై జెనకి చేయిచాఁచితే
వొట్టుకొని పెనఁగుతా నొడ్డుకొనేవు
గుట్టుతోడ నుండేవి మీ గుణము లింతేకాని
పట్టుజిగురువంటిది పాయనిమీవలపు

(॥॥)
చెలిమిసేయుచు నాపె సెలవుల నగితేను
చెలరేగి నవ్వేవు శ్రీ వేంకటేశ
బలిమి చూపేవి మీ పంతము లింతేకాని
తలిరులవంటివి బిత్తరపు మీ మోవులు

(||pallavi||)
anniyum̐ dĕlisinave aṁdarunu
vĕnnalo nedivaṁṭidi veḍuga nī priyamu

(||||)
mŏkkalāna nāgĕ ninnu moda nŏgamāḍāḍide
vĕkkasamulāḍevu vemārunu
makkuva mī iddarigi māḍale vāṁḍlugāni
lakkavaṁṭi vĕṁchisūḍa lavi mī manasulu

(||||)
siṭṭagāna kābĕ nībai jĕnagi seyisām̐side
vŏṭṭugŏni pĕnam̐gudā nŏḍḍugŏnevu
guṭṭudoḍa nuṁḍevi mī guṇamu liṁtegāni
paṭṭujiguruvaṁṭidi pāyanimīvalabu

(||||)
sĕlimiseyusu nābĕ sĕlavula nagidenu
sĕlaregi navvevu śhrī veṁkaḍeśha
balimi sūbevi mī paṁtamu liṁtegāni
talirulavaṁṭivi bittarabu mī movulu