అన్నియుఁ దనకు నాకు నమరియున్నవి నేఁడు
(॥పల్లవి॥)
అన్నియుఁ దనకు నాకు నమరియున్నవి నేఁడు
యెన్నికల కెక్కెఁ బతి నీడకు రమ్మనవే
(॥అన్ని॥)
చనవుగలచోటను సరసము చవులౌను
మనసెనసినచోట మాట లింపౌను
ననుపులయినచోట నవ్వులు ప్రియములౌను
వినయముచూపేచొట వేడుకలౌఁ జేలిమి
(॥అన్ని॥)
కూడివున్నచోటను గుదిగొను వలపులు
వాడిక లబ్బిన చోట వసమౌ రతి
పాడి నెరపేటిచోట పంతములు సమకూరు
యీడైవుండినచొట హెచ్చుఁ దమకములు
(॥అన్ని॥)
సమ్మతియయినచోట సతమౌను కాఁపురము
నమ్మికైనచోటను నంటు లీడేరు
నెమ్మి శ్రీవేంకటేశుఁడు నే నలమేలుమంగను
వుమ్మడి నన్నేలె నిఁక నొనరు సంతోసము
(||pallavi||)
anniyum̐ danagu nāgu namariyunnavi nem̐ḍu
yĕnnigala kĕkkĕm̐ badi nīḍagu rammanave
(||anni||)
sanavugalasoḍanu sarasamu savulaunu
manasĕnasinasoḍa māḍa liṁpaunu
nanubulayinasoḍa navvulu priyamulaunu
vinayamusūbesŏḍa veḍugalaum̐ jelimi
(||anni||)
kūḍivunnasoḍanu gudigŏnu valabulu
vāḍiga labbina soḍa vasamau radi
pāḍi nĕrabeḍisoḍa paṁtamulu samagūru
yīḍaivuṁḍinasŏḍa hĕchchum̐ damagamulu
(||anni||)
sammadiyayinasoḍa sadamaunu kām̐puramu
nammigainasoḍanu naṁṭu līḍeru
nĕmmi śhrīveṁkaḍeśhum̐ḍu ne nalamelumaṁganu
vummaḍi nannelĕ nim̐ka nŏnaru saṁtosamu