అన్నియు వేసాలే మీకు నలుకేడది
(॥పల్లవి॥)
అన్నియు వేసాలే మీకు నలుకేడది
మన్నించు మా ముందరనే మతకము లేఁటికి
(॥అన్ని॥)
వుప్పతిల్ల నాకె నీవు వొకరొకరి మొకాలు
రెప్పలెత్తి చూడఁగాను రేసులేడవి
తొప్పఁదోఁగు జెమటలతోడ మీ సెలవుల
చిప్పిల నవ్వఁగాను చింతలేడవి
(॥అన్ని॥)
సంగతిగా మీలోమీరు సరసములాడుకొంటా
కొంగులు వట్టుండఁగా కోపాలేడవి
యెంగిలి మోపులతోడ యేకమై పానుపుమీఁద
సంగతిఁ బెనఁగఁగా మచ్చరములేడవి
(॥అన్ని॥)
కైవసమై యిట్టలను కనుసన్నలకు లోలో
భావములు గరఁగఁగా పంతాలేడవి
యీవల శ్రీవేంకటేశ యెనసితిరి రతుల
చేవదేరెఁ బనులెల్లా సిగ్గులేడవి
(||pallavi||)
anniyu vesāle mīgu nalugeḍadi
manniṁchu mā muṁdarane madagamu lem̐ṭigi
(||anni||)
vuppadilla nāgĕ nīvu vŏgarŏgari mŏgālu
rĕppalĕtti sūḍam̐gānu resuleḍavi
tŏppam̐dom̐gu jĕmaḍaladoḍa mī sĕlavula
sippila navvam̐gānu siṁtaleḍavi
(||anni||)
saṁgadigā mīlomīru sarasamulāḍugŏṁṭā
kŏṁgulu vaṭṭuṁḍam̐gā kobāleḍavi
yĕṁgili mobuladoḍa yegamai pānubumīm̐da
saṁgadim̐ bĕnam̐gam̐gā machcharamuleḍavi
(||anni||)
kaivasamai yiṭṭalanu kanusannalagu lolo
bhāvamulu garam̐gam̐gā paṁtāleḍavi
yīvala śhrīveṁkaḍeśha yĕnasidiri radula
sevaderĕm̐ banulĕllā sigguleḍavi