Anniyu vedugalai yappadigi numdumgaaga

అన్నియు వేడుకలై యప్పటికి నుండుఁగాక
Language

(॥పల్లవి॥)
అన్నియు వేడుకలై యప్పటికి నుండుఁగాక
యెన్నికలు వెనకముం దేకము గాకుండునా

(॥అన్ని॥)
నిన్ను నేఁ జూచినపిప్పుడె నివ్వెరగాయ మేను
యెన్నఁగ నీవప్పుడు నన్నేమి సేసితో
పన్ని యెరఁగనివారి బలిమిఁ దడవితేను
మన్నన నాఫలము తమకు రాక మానునా

(॥అన్ని॥)
కదిసి నీవద్దనే కళదాఁకి వున్నవేళ
యెదుట నాచెవిలోన నేమంటివో
నిదిరించే వారిని నీవెంత దిట్టినాను
మదియించి నీచెవుల మగుడక వుండునా

(॥అన్ని॥)
తీరని నీరతివేళ దిమ్మువట్టి వుండఁగాను
యీరీతిని గురుతులేడ నించితో
చేరి నన్నుఁ గూడితివి శ్రీవేంకటేశ నీవు
కారణము నే నిన్నుఁగలయక పోదునా

(||pallavi||)
anniyu veḍugalai yappaḍigi nuṁḍum̐gāga
yĕnnigalu vĕnagamuṁ degamu gāguṁḍunā

(||anni||)
ninnu nem̐ jūsinabippuḍĕ nivvĕragāya menu
yĕnnam̐ga nīvappuḍu nannemi sesido
panni yĕram̐ganivāri balimim̐ daḍavidenu
mannana nāphalamu tamagu rāga mānunā

(||anni||)
kadisi nīvaddane kaḽadām̐ki vunnaveḽa
yĕduḍa nāsĕvilona nemaṁṭivo
nidiriṁche vārini nīvĕṁta diṭṭinānu
madiyiṁchi nīsĕvula maguḍaga vuṁḍunā

(||anni||)
tīrani nīradiveḽa dimmuvaṭṭi vuṁḍam̐gānu
yīrīdini guruduleḍa niṁchido
seri nannum̐ gūḍidivi śhrīveṁkaḍeśha nīvu
kāraṇamu ne ninnum̐galayaga podunā