Anniyu nerusugonnaam dalavaade yaadanigi

అన్నియు నేరుచుకొన్నాఁ డలవాటే యాతనికి
Language

(॥పల్లవి॥)
అన్నియు నేరుచుకొన్నాఁ డలవాటే యాతనికి
యెన్ని యైనఁ గల విట్టే యింటి కింక రావే

(॥అన్నియు॥)
వట్టిమాకు లిగిరించు వాఁడు మాట లాడితేను
యిట్టె నన్ను గరఁగించు టేమి సోద్యమే
వెట్టికి వింటేం జాలు వేగాదాఁకఁ జేప్పీఁ దాను
బట్టబయ లీఁద నోపఁ బదవే మాయింటికి

(॥అన్నియు॥)
ఱాతికి గిలిగింత లౌ ఱట్టడినవానిచేఁతల
యీతల నన్ను నవ్వించే దేమి సోద్యమే
చేతికి లో నైతేఁ జాలు సేయఁగల ట్టెల్లాఁ జేసి
పోతరించి వున్నవాఁడు పోదమే మా యింటికి

(॥అన్నియు॥)
యేరు లైన నెదు రెక్కు యిట్టి వీనిఁ బొడగంటే
యీరీతి మనము వచ్చే దేమి సోద్యమే
చేరినన్ను నిటు గూడె శ్రీవెంకటేశ్వరుఁడు
ఆరె దేరెఁ బిలువవే అతని మాయింటికి

(||pallavi||)
anniyu nerusugŏnnām̐ ḍalavāḍe yādanigi
yĕnni yainam̐ gala viṭṭe yiṁṭi kiṁka rāve

(||anniyu||)
vaṭṭimāgu ligiriṁchu vām̐ḍu māḍa lāḍidenu
yiṭṭĕ nannu garam̐giṁchu ṭemi sodyame
vĕṭṭigi viṁṭeṁ jālu vegādām̐kam̐ jeppīm̐ dānu
baṭṭabaya līm̐da nobam̐ badave māyiṁṭigi

(||anniyu||)
ṟādigi giligiṁta lau ṟaṭṭaḍinavānisem̐tala
yīdala nannu navviṁche demi sodyame
sedigi lo naidem̐ jālu seyam̐gala ṭṭĕllām̐ jesi
podariṁchi vunnavām̐ḍu podame mā yiṁṭigi

(||anniyu||)
yeru laina nĕdu rĕkku yiṭṭi vīnim̐ bŏḍagaṁṭe
yīrīdi manamu vachche demi sodyame
serinannu niḍu gūḍĕ śhrīvĕṁkaḍeśhvarum̐ḍu
ārĕ derĕm̐ biluvave adani māyiṁṭigi