Anniyu neneṟumgudu nanugonelaa

అన్నియు నేనెఱుఁగుదు ననుకోనేలా
Language

(॥పల్లవి॥)
అన్నియు నేనెఱుఁగుదు ననుకోనేలా
కన్న విన్నవెల్లా నీ కతలే కదా

(॥అన్ని॥)
పెచ్చురేఁగి సారె సారె ప్రియములెంత చెప్పినా
మచ్చిక గరఁగేది నీమనసే కదా
ముచ్చటతో నిట్టె నే మొక్కు లెన్ని మొక్కినాను
కచ్చుపెట్టి చూచేవి నీ కన్నులే కదా

(॥అన్ని॥)
బోరన వేఁడుకొనుచు బుద్దు లిన్ని చెప్పినాను
కోరి మంచిదయ్యేది నీ గుణమేకదా
గారవించి నేనెంత కరములు చాఁచినాను
మేరతో లోనయ్యేది నీ మేనేకదా

(॥అన్ని॥)
తలపోసి తలపోసి తమి యెంత రేఁచినాను
కలసి వుండేది నీ కాఁగిలే కదా
యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్నీ నేఁడు
నెలకొన్నవాఁడవు నీవే కదా

(||pallavi||)
anniyu nenĕṟum̐gudu nanugonelā
kanna vinnavĕllā nī kadale kadā

(||anni||)
pĕchchurem̐gi sārĕ sārĕ priyamulĕṁta sĕppinā
machchiga garam̐gedi nīmanase kadā
muchchaḍado niṭṭĕ ne mŏkku lĕnni mŏkkinānu
kachchubĕṭṭi sūsevi nī kannule kadā

(||anni||)
borana vem̐ḍugŏnusu buddu linni sĕppinānu
kori maṁchidayyedi nī guṇamegadā
gāraviṁchi nenĕṁta karamulu sām̐sinānu
merado lonayyedi nī menegadā

(||anni||)
talabosi talabosi tami yĕṁta rem̐sinānu
kalasi vuṁḍedi nī kām̐gile kadā
yĕlami śhrī veṁkaḍeśha yelidivi nannī nem̐ḍu
nĕlagŏnnavām̐ḍavu nīve kadā