Anniyu neneṟumgudu namta badalagu neevu

అన్నియు నేనెఱుఁగుదు నంత బడలకు నీవు
Language

(॥పల్లవి॥)
అన్నియు నేనెఱుఁగుదు నంత బడలకు నీవు
సన్నలు సేయఁగఁ బైపై జడిసీఁ బులకలు

(॥॥)
యించుకే మాటాడవోయిటు నాతోను
పొంచిన నీమోవి గెంపులు రేఁగీని
వంచకువోయి శిరసు వడిఁ జెక్కుపై
వుంచవు నీ కొప్పు పువ్వులు రాలీని

(॥॥)
చేతులు చాఁచకువోయి చేరి నాపైని
యేతలి గురుతులు బాయిటఁ బడీని
ఘాతల జూడకువోయి కన్నవారినే
రాతిరి సిగ్గులు నేఁడు రచ్చఁ బడీని

(॥॥)
పెనఁగకువోయి ముట్టి బెరసి నాతో
తనువుపై వాసనలు తగిలీ నన్ను
ఘనుఁడ శ్రీవేంకటేశ కలిసితి మిద్దరము
అనుమానించకువోయి అడికె వచ్చీని

(||pallavi||)
anniyu nenĕṟum̐gudu naṁta baḍalagu nīvu
sannalu seyam̐gam̐ baibai jaḍisīm̐ bulagalu

(||||)
yiṁchuge māḍāḍavoyiḍu nādonu
pŏṁchina nīmovi gĕṁpulu rem̐gīni
vaṁchaguvoyi śhirasu vaḍim̐ jĕkkubai
vuṁchavu nī kŏppu puvvulu rālīni

(||||)
sedulu sām̐saguvoyi seri nābaini
yedali gurudulu bāyiḍam̐ baḍīni
ghādala jūḍaguvoyi kannavārine
rādiri siggulu nem̐ḍu rachcham̐ baḍīni

(||||)
pĕnam̐gaguvoyi muṭṭi bĕrasi nādo
tanuvubai vāsanalu tagilī nannu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalisidi middaramu
anumāniṁchaguvoyi aḍigĕ vachchīni