Anniyu neeverumguduvane dimka nemunnadi

అన్నియు నీవెరుఁగుదువనే దిఁక నేమున్నది
Language

(॥పల్లవి॥)
అన్నియు నీవెరుఁగుదువనే దిఁక నేమున్నది
కన్నులె గొప్పలుగాని కడుఁ జిన్నిమొగము

(॥॥)
దండనే వుండఁగాను దయఁ.జూడవలెఁ గాక
చండివెట్టి పెనఁగుతా సాముసేతురా
పండుమోవిపసే కాని పలుచనిదాన నేను
అందుకొని కొసరేవు అలయఁగనోపను

(॥॥)
సేవలు నీకుఁజేయగా చేరి మెచ్చవలెఁకాక
రావాడి చెనకుతా రవ్వసేతురా
యీవలఁ జన్నులే గొప్ప లించుకంతె నెన్నడుము
వోవలఁ బెట్టితే నంత వోరుచుకోనోపను

(॥॥)
నీసతినై వుండఁగానే నెమ్మది నుంతువు గాక
ఆస చూపి తరితీపు లడరింతురా
వాసితో శ్రీ వేంకటేశ వడి నన్నుఁ గూడితివి
పోసరించె బిరు దురమునఁ బాయనోపను

(||pallavi||)
anniyu nīvĕrum̐guduvane dim̐ka nemunnadi
kannulĕ gŏppalugāni kaḍum̐ jinnimŏgamu

(||||)
daṁḍane vuṁḍam̐gānu dayam̐.jūḍavalĕm̐ gāga
saṁḍivĕṭṭi pĕnam̐gudā sāmusedurā
paṁḍumovibase kāni palusanidāna nenu
aṁdugŏni kŏsarevu alayam̐ganobanu

(||||)
sevalu nīgum̐jeyagā seri mĕchchavalĕm̐kāga
rāvāḍi sĕnagudā ravvasedurā
yīvalam̐ jannule gŏppa liṁchugaṁtĕ nĕnnaḍumu
vovalam̐ bĕṭṭide naṁta vorusugonobanu

(||||)
nīsadinai vuṁḍam̐gāne nĕmmadi nuṁtuvu gāga
āsa sūbi taridību laḍariṁturā
vāsido śhrī veṁkaḍeśha vaḍi nannum̐ gūḍidivi
posariṁchĕ biru duramunam̐ bāyanobanu