Anniyu neevalla nimte saaya nayyaa

అన్నియు నీవల్ల నింతే సాయ నయ్యా
Language

(॥పల్లవి॥)
అన్నియు నీవల్ల నింతే సాయ నయ్యా
నిన్న నేఁటనె యీ మేలు నిండె నయ్యా

(॥అన్నియు॥)
సాదించి నేఁ డాపె నీసరిఁ గూచుండినది నీ
పాదము సోఁకినయట్టి బలు వయ్యా
ఆదికొని యిన్నా ళ్లాపె ఆపె గాదో నేఁ గాదో
యీదెస మేరలు మీరి యిట్లనె వుంటిమా

(॥అన్నియు॥)
యించు కంత పిన్నది నా కెదురు మాటాడె నిదే
మించి నీ నవ్వినముందెమేళ మయ్య
నించి వొక్కవూరనె నే లేనో ఆపె లేదో
చంచు మీరి యింతేసి రచ్చలకు నెక్కుదుమా

(॥అన్నియు॥)
తేరకొన నాపె నన్ను దిష్టించి చూచినది
కోరి నీచేయి వేసినగఱ మయ్యా
యీరీతి శ్రీవెంకటేశ యిటు నన్నుఁ గూడితివి
నేరువు నీ వల్లఁ గాక నే మొక్కటి అవుదుమా

(||pallavi||)
anniyu nīvalla niṁte sāya nayyā
ninna nem̐ṭanĕ yī melu niṁḍĕ nayyā

(||anniyu||)
sādiṁchi nem̐ ḍābĕ nīsarim̐ gūsuṁḍinadi nī
pādamu som̐kinayaṭṭi balu vayyā
ādigŏni yinnā ḽlābĕ ābĕ gādo nem̐ gādo
yīdĕsa meralu mīri yiṭlanĕ vuṁṭimā

(||anniyu||)
yiṁchu kaṁta pinnadi nā kĕduru māḍāḍĕ nide
miṁchi nī navvinamuṁdĕmeḽa mayya
niṁchi vŏkkavūranĕ ne leno ābĕ ledo
saṁchu mīri yiṁtesi rachchalagu nĕkkudumā

(||anniyu||)
teragŏna nābĕ nannu diṣhṭiṁchi sūsinadi
kori nīseyi vesinagaṟa mayyā
yīrīdi śhrīvĕṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
neruvu nī vallam̐ gāga ne mŏkkaḍi avudumā