అన్నియు నీ వెఱుఁగుదు వద్దమాడ నే నీకు
(॥పల్లవి॥)
అన్నియు నీ వెఱుఁగుదు వద్దమాడ నే నీకు
మన్నించ నేరుతువు మారుమాట లేఁటికి
(॥అన్ని॥)
సేసవెట్టి నీవు నాపై చెలిమిసేసినట్టి-
వాసులకే పెనఁగేను వద్ద నుండి
సేసుకొన్న మగఁడవు చిత్తముకొలఁది ఇఁక
రాసికెక్కె నాపంతము రవ్వసేయనేఁటికి
(॥అని॥)
కన్నులఁ జూచి నాతో కవకవ నవ్వినట్టి-
సన్నలకే పిలిచేను సారె సారెకు
యిన్నేసి నమ్మిక లిచ్చి తెటువలసినఁ జేయు
వన్నె వచ్చె నారతికి వంకలొత్తనేఁటికి
(॥అన్ని॥)
కందువకుఁ దీసి నన్ను కాఁగిలించి కూడినట్టి-
అందాలకే తగిలేను అప్పటనుండి
పొందిన శ్రీ వేంకటేశ భువి నీకృప నించితిఁ
వందమాయ నాజన్మము అలయించనేఁటికి
(||pallavi||)
anniyu nī vĕṟum̐gudu vaddamāḍa ne nīgu
manniṁcha neruduvu mārumāḍa lem̐ṭigi
(||anni||)
sesavĕṭṭi nīvu nābai sĕlimisesinaṭṭi-
vāsulage pĕnam̐genu vadda nuṁḍi
sesugŏnna magam̐ḍavu sittamugŏlam̐di im̐ka
rāsigĕkkĕ nābaṁtamu ravvaseyanem̐ṭigi
(||ani||)
kannulam̐ jūsi nādo kavagava navvinaṭṭi-
sannalage pilisenu sārĕ sārĕgu
yinnesi nammiga lichchi tĕḍuvalasinam̐ jeyu
vannĕ vachchĕ nāradigi vaṁkalŏttanem̐ṭigi
(||anni||)
kaṁduvagum̐ dīsi nannu kām̐giliṁchi kūḍinaṭṭi-
aṁdālage tagilenu appaḍanuṁḍi
pŏṁdina śhrī veṁkaḍeśha bhuvi nīkṛpa niṁchidim̐
vaṁdamāya nājanmamu alayiṁchanem̐ṭigi