Anniyu namde yunnavi adigo maada

అన్నియు నందె యున్నవి అదిగో మాట
Language

(॥పల్లవి॥)
అన్నియు నందె యున్నవి అదిగో మాట
యెన్నుకొనె దినములు ఇదిగో మాట

(॥॥)
సీత నీకుఁ జెప్పి పంపి శిరోమణి నీకిచ్చె-
నాతల నే మెఱఁగము అదేమాట
చేతినీవుంగరమును శిరసున నెత్తుకొనె
యేతలఁపు లెట్లౌనో ఇదిగో మాట

(॥॥)
తాడుపడ్డనేనితోడ తలఁపు నీకొప్పగించి
యేడవుతా నెఱఁగదు ఇదివో మాట
పాడిదప్ప దించుకంతా పదిల మాకెగుణము
అడ నేమీఁ జోటులేదు అదిగో మాట

(॥॥)
తెఱవ నీకు బాసిచ్చె దేవతలమాట విను
యెఱుఁగినదే ఇందరు ఇదిగో మాట
గుఱుతై శ్రీ వేంకటాద్రిఁ గూడితి రిద్దరు మీరు
అఱిముఱి రామచంద్ర అదిగో మాట

(||pallavi||)
anniyu naṁdĕ yunnavi adigo māḍa
yĕnnugŏnĕ dinamulu idigo māḍa

(||||)
sīda nīgum̐ jĕppi paṁpi śhiromaṇi nīgichchĕ-
nādala ne mĕṟam̐gamu ademāḍa
sedinīvuṁgaramunu śhirasuna nĕttugŏnĕ
yedalam̐pu lĕṭlauno idigo māḍa

(||||)
tāḍubaḍḍanenidoḍa talam̐pu nīgŏppagiṁchi
yeḍavudā nĕṟam̐gadu idivo māḍa
pāḍidappa diṁchugaṁtā padila māgĕguṇamu
aḍa nemīm̐ joḍuledu adigo māḍa

(||||)
tĕṟava nīgu bāsichchĕ devadalamāḍa vinu
yĕṟum̐ginade iṁdaru idigo māḍa
guṟudai śhrī veṁkaḍādrim̐ gūḍidi riddaru mīru
aṟimuṟi rāmasaṁdra adigo māḍa