(॥పల్లవి॥)
అన్నియు మీలో నమరు నిఁక
యిన్నియు మీరే యెఱుఁగుదు రిఁకనూ
(॥అన్ని॥)
కగ్గక మీలోఁ గలిగిన మాఁటకు
యెగ్గువట్ట మరి యిఁకనేలా
సిగ్గుతోడఁ దనశిరసు వంచితే
వెగ్గిళించి అనవెరతుము గానీ
(॥అన్ని॥)
యెప్పటివలెనే యెరిఁగినపనులకు
తప్పు లెంచ మరి తగ దిఁకనూ
ముప్పిరి నలయుచు మోనాన నుండితే
యిప్పు డందులకు నెఱఁగము గానీ
(॥అన్ని॥)
అలవాటై మీ రాడుసరసముల
తొలుత నెచ్చుకుందులు లేవు
యెలమిని శ్రీవేంకటేశ కూడితివి
అలివేణిని నిన్నాడము గానీ
(||pallavi||)
anniyu mīlo namaru nim̐ka
yinniyu mīre yĕṟum̐gudu rim̐kanū
(||anni||)
kaggaga mīlom̐ galigina mām̐ṭagu
yĕgguvaṭṭa mari yim̐kanelā
siggudoḍam̐ danaśhirasu vaṁchide
vĕggiḽiṁchi anavĕradumu gānī
(||anni||)
yĕppaḍivalĕne yĕrim̐ginabanulagu
tappu lĕṁcha mari taga dim̐kanū
muppiri nalayusu monāna nuṁḍide
yippu ḍaṁdulagu nĕṟam̐gamu gānī
(||anni||)
alavāḍai mī rāḍusarasamula
tŏluda nĕchchuguṁdulu levu
yĕlamini śhrīveṁkaḍeśha kūḍidivi
aliveṇini ninnāḍamu gānī