Anniyu maṟasidimbo amduge nenu

అన్నియు మఱచితిఁబో అందుకే నేను
Language

(॥పల్లవి॥)
అన్నియు మఱచితిఁబో అందుకే నేను
యెన్నుకొందు నీ గుణము లిందుకే నేను

(॥అన్ని॥)
పట్టి నేఁ గోపగించితే పైపై వేఁడుకొనేవు
అట్టెఁ వలచితి బో అందుకే నేను
దిట్టినై వెంగె మాడితే తేటగా నవ్వేవు నీవు
యెట్టు నిన్ను మానఁగల యిందుకే నేను

(॥అన్ని॥)
అలిగి పూరకుండితే ఆయము లంటుదు నీవు
అలరి పాయఁగ లేను అందుకే నేను
మలసి పల్కకుండితే మాటలాడింతువు నీవు
యెలమిఁ గరఁగుదుఁబో యిందుకే నేను

(॥అన్ని॥)
నే నాడకు రాకుండితే నీవే విచ్చేతువు
ఆనందాన నుండుదుఁబో అందుకే నేను
ఆనకపు శ్రీవేంకటాధిప నన్నుఁ గూడితి
నీ నిజము మెచ్చితిఁబో యిందుకే నేను

(||pallavi||)
anniyu maṟasidim̐bo aṁduge nenu
yĕnnugŏṁdu nī guṇamu liṁduge nenu

(||anni||)
paṭṭi nem̐ gobagiṁchide paibai vem̐ḍugŏnevu
aṭṭĕm̐ valasidi bo aṁduge nenu
diṭṭinai vĕṁgĕ māḍide teḍagā navvevu nīvu
yĕṭṭu ninnu mānam̐gala yiṁduge nenu

(||anni||)
aligi pūraguṁḍide āyamu laṁṭudu nīvu
alari pāyam̐ga lenu aṁduge nenu
malasi palgaguṁḍide māḍalāḍiṁtuvu nīvu
yĕlamim̐ garam̐gudum̐bo yiṁduge nenu

(||anni||)
ne nāḍagu rāguṁḍide nīve vichcheduvu
ānaṁdāna nuṁḍudum̐bo aṁduge nenu
ānagabu śhrīveṁkaḍādhiba nannum̐ gūḍidi
nī nijamu mĕchchidim̐bo yiṁduge nenu