Anniyu marasi neevaadina tlaaduda gaaga

అన్నియు మరచి నీవాడిన ట్లాడుట గాక
Language

(॥పల్లవి॥)
అన్నియు మరచి నీవాడిన ట్లాడుట గాక
పన్నిన పంతములేల పట్టి పెనఁగఁగను

(॥॥)
వోడక నిన్నెటువలె నూరక సొలయవచ్చు
యేడలేని వినయము రెల్లాఁ జేయఁగా
పాడితో నిన్నుఁ దప్పులు పట్ట నెటువలె వచ్చు
వీడెము చేతికిచ్చి వేడుకొనఁగాను

(॥॥)
చేయి చాఁచి నిన్నెట్టు చెనకకు మనవచ్చు
ఆయము గరఁగి నీవాసపడఁగా
చాయల సన్నల నిన్ను జంకించ నెట్టు వచ్చు
పాయము నాసొమ్ముసేసి బాఁతిపడఁగాను

(॥॥)
తగిలి నీకాఁగిటిలో తనియంగ నెట్టువచ్చు
మిగులా నీనేరుపులు మెఱయఁగాను
అగవడి శ్రీవేంకటాధిప నన్నేలితివి
బగివాయ నెట్టు వచ్చు పాలార్చఁగాను

(||pallavi||)
anniyu marasi nīvāḍina ṭlāḍuḍa gāga
pannina paṁtamulela paṭṭi pĕnam̐gam̐ganu

(||||)
voḍaga ninnĕḍuvalĕ nūraga sŏlayavachchu
yeḍaleni vinayamu rĕllām̐ jeyam̐gā
pāḍido ninnum̐ dappulu paṭṭa nĕḍuvalĕ vachchu
vīḍĕmu sedigichchi veḍugŏnam̐gānu

(||||)
seyi sām̐si ninnĕṭṭu sĕnagagu manavachchu
āyamu garam̐gi nīvāsabaḍam̐gā
sāyala sannala ninnu jaṁkiṁcha nĕṭṭu vachchu
pāyamu nāsŏmmusesi bām̐tibaḍam̐gānu

(||||)
tagili nīgām̐giḍilo taniyaṁga nĕṭṭuvachchu
migulā nīnerubulu mĕṟayam̐gānu
agavaḍi śhrīveṁkaḍādhiba nannelidivi
bagivāya nĕṭṭu vachchu pālārsam̐gānu