Annidigi nobum daanu aamtadaana nenu

అన్నిటికి నోపుఁ దాను ఆఁటదాన నేను
Language

(॥పల్లవి॥)
అన్నిటికి నోపుఁ దాను ఆఁటదాన నేను
వెన్న వట్టుకొని నెయ్యి వెదకఁగఁ దగునా

(॥॥)
ఆసతోడ నేఁ దన్ను ఆయము లంటఁ గాను
వేసారకు మనవే వేమారును
సేసవెట్టి పెండ్లాడె చేత కంకణము గట్టె
బేసబెల్లితనమున పెనఁగఁగఁదగునా

(॥॥)
భావించి సరసములు పలుమారు నాడఁ గా
నేవంక పరాకు తనకేఁటికే యది
వావు లొనగూడఁ జెప్పె వలపులు పెడరేఁచె
చేవమీరినపనికి సిగ్గువడఁదగునా

(॥॥)
కాఁగిలించుకొని తన్నుఁ గందువలఁ గూడఁగాను
వీఁగఁ జెల్లునా శ్రీ వేంకటేశుఁడు
తోఁగించె చెమటనీరు తోక్కినాఁడు పాదము
మాఁగినమోవి యొసఁగి మచ్చువేయఁదగునా

(||pallavi||)
anniḍigi nobum̐ dānu ām̐ṭadāna nenu
vĕnna vaṭṭugŏni nĕyyi vĕdagam̐gam̐ dagunā

(||||)
āsadoḍa nem̐ dannu āyamu laṁṭam̐ gānu
vesāragu manave vemārunu
sesavĕṭṭi pĕṁḍlāḍĕ seda kaṁkaṇamu gaṭṭĕ
besabĕllidanamuna pĕnam̐gam̐gam̐dagunā

(||||)
bhāviṁchi sarasamulu palumāru nāḍam̐ gā
nevaṁka parāgu tanagem̐ṭige yadi
vāvu lŏnagūḍam̐ jĕppĕ valabulu pĕḍarem̐sĕ
sevamīrinabanigi sigguvaḍam̐dagunā

(||||)
kām̐giliṁchugŏni tannum̐ gaṁduvalam̐ gūḍam̐gānu
vīm̐gam̐ jĕllunā śhrī veṁkaḍeśhum̐ḍu
tom̐giṁchĕ sĕmaḍanīru tokkinām̐ḍu pādamu
mām̐ginamovi yŏsam̐gi machchuveyam̐dagunā