అన్నిటికి నేరుతువు అవునయ్యా
(॥పల్లవి॥)
అన్నిటికి నేరుతువు అవునయ్యా
కన్నదే కంది గురుమ కంటిమయ్యా
(॥అన్ని॥)
పిలిచె నిందాఁకాను పెద్దయెలుఁగున నింతి
పొలసి నీ వెక్కడికిఁ బోతివయ్యా
మొలచినట్లు వచ్చి ముసుఁగుతో పానుపుపై
తల గానరా దాఁగేవు తగునయ్యా
(॥అన్ని॥)
వెదకె నిందాఁకాను వీదులవీదుల నాకె
వుదుటున నెవ్వరింట నుంటివయ్యా
తుద పిందె దిగినట్టు దోమతెరమరఁగున
నిదురవోతా బొంకేవు నేరుపరివయ్యా
(॥అన్ని॥)
కొసరె నిందాఁకాను కొమ్మ నీకాఁగిటఁ గూడి
వెస నేమని చెవుల వింటివయ్యా
రసిక శ్రీవేంకటేశ రమణిఁ గూడితి విట్టె
కసుగాయమో విచ్చేవు ఘనుఁడవయ్యా
(||pallavi||)
anniḍigi neruduvu avunayyā
kannade kaṁdi guruma kaṁṭimayyā
(||anni||)
pilisĕ niṁdām̐kānu pĕddayĕlum̐guna niṁti
pŏlasi nī vĕkkaḍigim̐ bodivayyā
mŏlasinaṭlu vachchi musum̐gudo pānububai
tala gānarā dām̐gevu tagunayyā
(||anni||)
vĕdagĕ niṁdām̐kānu vīdulavīdula nāgĕ
vuduḍuna nĕvvariṁṭa nuṁṭivayyā
tuda piṁdĕ diginaṭṭu domadĕramaram̐guna
niduravodā bŏṁkevu nerubarivayyā
(||anni||)
kŏsarĕ niṁdām̐kānu kŏmma nīgām̐giḍam̐ gūḍi
vĕsa nemani sĕvula viṁṭivayyā
rasiga śhrīveṁkaḍeśha ramaṇim̐ gūḍidi viṭṭĕ
kasugāyamo vichchevu ghanum̐ḍavayyā