అన్నిటికి నీవె నేర్తు వంతవాఁడవు
(॥పల్లవి॥)
అన్నిటికి నీవె నేర్తు వంతవాఁడవు
యెన్నిక బుద్ది నా కానతియ్యవయ్య యిఁకను
(॥అన్ని॥)
వాదులు వెట్టుకోఁబోతే వలపులకు వెలితి
సోదించఁబోతే లేదు చుట్టరికము
కాదని వూరకుండితే కడు గర్వమై తోఁచు
యేది నాకు బుద్ది అనతియ్యవయ్య యిఁకను
(॥అన్ని॥)
మొక్కళానఁ దిట్టితేను మొగమోటానకు లేఁత
కక్కసించితేఁ జనిగాదు కూటమి
పెక్కుమాట లాడఁబోతే పెద్దరికము చాలదు
యెక్కువబుద్ది నాకానతియ్యవయ్య ఇఁకను
(॥అన్ని॥)
యిట్టె నే నవ్వకుండితే యిచ్చకానకు కడమ
మట్టున నే నుండితేను మానదు తమి
గట్టిగా శ్రీవేంకటేశ కలసితివిదె నన్ను
యెట్టైనా బుద్ది నా కానతియ్యవయ్య యిఁకను
(||pallavi||)
anniḍigi nīvĕ nerdu vaṁtavām̐ḍavu
yĕnniga buddi nā kānadiyyavayya yim̐kanu
(||anni||)
vādulu vĕṭṭugom̐bode valabulagu vĕlidi
sodiṁcham̐bode ledu suṭṭarigamu
kādani vūraguṁḍide kaḍu garvamai tom̐su
yedi nāgu buddi anadiyyavayya yim̐kanu
(||anni||)
mŏkkaḽānam̐ diṭṭidenu mŏgamoḍānagu lem̐ta
kakkasiṁchidem̐ janigādu kūḍami
pĕkkumāḍa lāḍam̐bode pĕddarigamu sāladu
yĕkkuvabuddi nāgānadiyyavayya im̐kanu
(||anni||)
yiṭṭĕ ne navvaguṁḍide yichchagānagu kaḍama
maṭṭuna ne nuṁḍidenu mānadu tami
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidividĕ nannu
yĕṭṭainā buddi nā kānadiyyavayya yim̐kanu