Annidigi moolamu shreehariye sumdi

అన్నిటికి మూలము శ్రీహరియె సుండి
Language

(॥పల్లవి॥)
అన్నిటికి మూలము శ్రీహరియె సుండి
విన్నవార కన్నవార విచారించుకొనుఁడీ

(॥అన్నిట॥)
దైవమునుఁ దలఁచక తత్వమును నెఱుఁగక
భావించుధ్యానము బట్టబయలు సుండీ
తోవ దెలుసుకొనక దొడ్డమతస్థుడు గాక
కావలెనంటే మోక్షము కలుగదు సుండీ

(॥అన్నిట॥)
అతిభక్తి నిలుపక హరిఁ గొనియాడక
వెతకేటి చదువులు వృథా సుండీ
యితరము లుడుగక యిన్నిటిపైరోయక
జుతకాముఁడు గాఁబోతే చిక్కదు సుండీ

(॥అన్నిట॥)
పాపములు విడువక పరిశుద్ధుఁడు గాక
యేపున జన్మఫల మీడేరదు సుండీ
దాపుగా శ్రీవేంకటేశుదాసుఁడ నంటేఁ గాక
తీపుల బ్రహ్మానందము తిరము గాదు సుండీ

(||pallavi||)
anniḍigi mūlamu śhrīhariyĕ suṁḍi
vinnavāra kannavāra visāriṁchugŏnum̐ḍī

(||anniḍa||)
daivamunum̐ dalam̐saga tatvamunu nĕṟum̐gaga
bhāviṁchudhyānamu baṭṭabayalu suṁḍī
tova dĕlusugŏnaga dŏḍḍamadasthuḍu gāga
kāvalĕnaṁṭe mokṣhamu kalugadu suṁḍī

(||anniḍa||)
adibhakti nilubaga harim̐ gŏniyāḍaga
vĕdageḍi saduvulu vṛthā suṁḍī
yidaramu luḍugaga yinniḍibairoyaga
judagāmum̐ḍu gām̐bode sikkadu suṁḍī

(||anniḍa||)
pābamulu viḍuvaga pariśhuddhum̐ḍu gāga
yebuna janmaphala mīḍeradu suṁḍī
dābugā śhrīveṁkaḍeśhudāsum̐ḍa naṁṭem̐ gāga
tībula brahmānaṁdamu tiramu gādu suṁḍī