అన్నిటికి మూలమని హరి నెంచరు
(॥పల్లవి॥)
అన్నిటికి మూలమని హరి నెంచరు
పన్నిన మాయలో వారు బయలు వాఁకేరు
(॥అన్ని॥)
ప్రకృతిబోనుల లోపలఁ జిక్కి జీవులు
అకట చక్కనివార మనుకొనేరు
సకలపుణ్యపాపాల సంది జన్మములవారు
వెకలి సంసారాలకే వేడుకపడేవారు
(॥అన్ని॥)
కామునియేట్ల దిగఁగారేటి దేహులు
దోమటి తమబదుకే దొడ్డదనేరు
పామిడి కోరికలకు బంట్లైనవారలు
గామిడితనాలఁ దామే కర్తలమనేరు
(॥అన్ని॥)
యితరలోకాలనెడి యేఁతపుమెట్ల ప్రాణులు
కతల వెూక్షమార్గము గంటిమనేరు
తతి నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వర
మతకాన నున్నవారు మారు మలసేరు
(||pallavi||)
anniḍigi mūlamani hari nĕṁcharu
pannina māyalo vāru bayalu vām̐keru
(||anni||)
prakṛtibonula lobalam̐ jikki jīvulu
agaḍa sakkanivāra manugŏneru
sagalabuṇyabābāla saṁdi janmamulavāru
vĕgali saṁsārālage veḍugabaḍevāru
(||anni||)
kāmuniyeṭla digam̐gāreḍi dehulu
domaḍi tamabaduge dŏḍḍadaneru
pāmiḍi korigalagu baṁṭlainavāralu
gāmiḍidanālam̐ dāme kardalamaneru
(||anni||)
yidaralogālanĕḍi yem̐tabumĕṭla prāṇulu
kadala vĕూkṣhamārgamu gaṁṭimaneru
tadi nalamelmaṁgabadi śhrīveṁkaḍeśhvara
madagāna nunnavāru māru malaseru