అన్నిటి కెక్కుడు యీవి హరియిచ్చేది
(॥పల్లవి॥)
అన్నిటి కెక్కుడు యీవి హరియిచ్చేది
మన్నించు నాతనికంటే మఱి లేరు దొరలు
(॥అన్ని॥)
తగు బ్రహ్మలోకముదాఁకా నెక్కిచూచిన
మగుడఁ బుట్టే లోకాలే మనుజులకు
తెగి యిచ్చే యింద్రాదిదేవతల వరములు
యెగువదిగువలను యీసందివే
(॥అన్ని॥)
మాయలోనఁ బుట్టేది మాయలోనఁ బెరిగేది
కాయదారులకు నెల్లాఁ గలిగినదే
సేయరాని పుణ్యమెల్లాఁ జేసి గడించుకోనేది
చాయల బహురూపపుసంసారమే
(॥అన్ని॥)
చెడని వైకుంఠ మిచ్చుఁ జేటులేని వర మిచ్చు
వెడమాయఁ బెడబాపు విష్ణుఁ డీతఁడే
యెడయెక శ్రీవేంకటేశుఁడై వున్నాఁడు వీఁడే
జడియ కితఁడే కాచు శరణంటేఁ జాలును
(||pallavi||)
anniḍi kĕkkuḍu yīvi hariyichchedi
manniṁchu nādanigaṁṭe maṟi leru dŏralu
(||anni||)
tagu brahmalogamudām̐kā nĕkkisūsina
maguḍam̐ buṭṭe logāle manujulagu
tĕgi yichche yiṁdrādidevadala varamulu
yĕguvadiguvalanu yīsaṁdive
(||anni||)
māyalonam̐ buṭṭedi māyalonam̐ bĕrigedi
kāyadārulagu nĕllām̐ galiginade
seyarāni puṇyamĕllām̐ jesi gaḍiṁchugonedi
sāyala bahurūbabusaṁsārame
(||anni||)
sĕḍani vaiguṁṭha michchum̐ jeḍuleni vara michchu
vĕḍamāyam̐ bĕḍabābu viṣhṇum̐ ḍīdam̐ḍe
yĕḍayĕga śhrīveṁkaḍeśhum̐ḍai vunnām̐ḍu vīm̐ḍe
jaḍiya kidam̐ḍe kāsu śharaṇaṁṭem̐ jālunu