Annidaanu vegadaina aamduvaaramu

అన్నిటాను వెగటైన ఆఁడువారము
Language

(॥పల్లవి॥)
అన్నిటాను వెగటైన ఆఁడువారము
యెన్ని లేవు మా సుద్దులు యేమి సేతుమయ్యా

(॥అన్న॥)
మొలక నవ్వు నవ్వితే మురిపెమువలె నుండు
సొలసితే రాజసము చూపి నట్టుండు
కలికనై మాఁటాడితే గయ్యాళించి నట్టుండు
యెలమి మావోజ లివి యేమి సేతుమయ్యా

(॥అన్ని॥)
దగ్గరఁ గూచుండితేను దంటతనమై యుండు
సిగ్గువడి వుంటే గర్వించిన యట్లుండు
వొగ్గి పెనఁగవచ్చితే వుద్దండములై నట్లుండు
యెగ్గు దప్పు లెఱఁగము యేమి సేతుమయ్యా

(॥అన్ని॥)
అదనఁ గాఁగిలించితే నారజమువలె నుండు
యెదుట నిలుచుంటేనే యెమ్మెలై యుండు
వెదకివచ్చి నన్ను శ్రీవేంకటేశ కూడితివి
ఇదవో మా కాఁపురము యేమి సేతుమయ్యా

(||pallavi||)
anniḍānu vĕgaḍaina ām̐ḍuvāramu
yĕnni levu mā suddulu yemi sedumayyā

(||anna||)
mŏlaga navvu navvide muribĕmuvalĕ nuṁḍu
sŏlaside rājasamu sūbi naṭṭuṁḍu
kaliganai mām̐ṭāḍide gayyāḽiṁchi naṭṭuṁḍu
yĕlami māvoja livi yemi sedumayyā

(||anni||)
daggaram̐ gūsuṁḍidenu daṁṭadanamai yuṁḍu
sigguvaḍi vuṁṭe garviṁchina yaṭluṁḍu
vŏggi pĕnam̐gavachchide vuddaṁḍamulai naṭluṁḍu
yĕggu dappu lĕṟam̐gamu yemi sedumayyā

(||anni||)
adanam̐ gām̐giliṁchide nārajamuvalĕ nuṁḍu
yĕduḍa nilusuṁṭene yĕmmĕlai yuṁḍu
vĕdagivachchi nannu śhrīveṁkaḍeśha kūḍidivi
idavo mā kām̐puramu yemi sedumayyā