Annidaanu nerajaana vauduve neevu

అన్నిటాను నెరజాణ వౌదువే నీవు
Language

(॥పల్లవి॥)
అన్నిటాను నెరజాణ వౌదువే నీవు
మన్నన లందితివే మగనిచే నీవు

(॥॥)
చొక్కపుఁ జూపులఁ బతిఁ జూడనేర్తువే
మొక్కుతానే కొనగోరు మోపనేర్తువే
చిక్కనినవ్వులతోడ సిగ్గుపడనేర్తువే
చెక్కు నొక్కి ప్రియముల చెప్పనేర్తువే

(॥॥)
చెప్పక పడిగాలెల్లాఁ జేయనేర్తువే
చెప్పరానిసన్నలు సేయనేర్తువే
చొప్పులుగా చనుఁగవసోఁకించనేర్తువే
దప్పిదేర మోవి చూపి తమిరేఁచనేర్తువే

(॥॥)
ననుపులు సేసుక పెనఁగనేరుతువే
యెనసి బాగాలు నీ వియ్యనేర్తువే
అనుఁగు శ్రీ వేంకటేశునలమేలుమంగవు నీవు
తనియఁగఁ గూడితివి తలఁ పించనేర్తువే

(||pallavi||)
anniḍānu nĕrajāṇa vauduve nīvu
mannana laṁdidive maganise nīvu

(||||)
sŏkkabum̐ jūbulam̐ badim̐ jūḍanerduve
mŏkkudāne kŏnagoru mobanerduve
sikkaninavvuladoḍa siggubaḍanerduve
sĕkku nŏkki priyamula sĕppanerduve

(||||)
sĕppaga paḍigālĕllām̐ jeyanerduve
sĕpparānisannalu seyanerduve
sŏppulugā sanum̐gavasom̐kiṁchanerduve
dappidera movi sūbi tamirem̐sanerduve

(||||)
nanubulu sesuga pĕnam̐ganeruduve
yĕnasi bāgālu nī viyyanerduve
anum̐gu śhrī veṁkaḍeśhunalamelumaṁgavu nīvu
taniyam̐gam̐ gūḍidivi talam̐ piṁchanerduve