Annidaanu meludaananaidi nenu

అన్నిటాను మేలుదాననైతి నేను
Language

(॥పల్లవి॥)
అన్నిటాను మేలుదాననైతి నేను
కన్నులఁ జూడఁగ నాకుఁ గలిగెఁగా తాను

(॥అన్ని॥)
యెడ నుండినానేమి యేమి సేసినా యేమి
వాడికతో మాయింతికి వచ్చెఁగా తాను
కోడెకాఁడయితేనేమి గురుతు లుండితే యేమి
జోడుగూడి నా మొగము చూచెఁగా తాను

(॥అన్ని॥)
యెంతపరాకైననేమి యెవ్వతెఁ దెచ్చినానేమి
అంతరంగముతో మాఁటలాడెఁగా తాను
పంతగాఁడయితేనేమి బయలీఁదించితే నేమి
యింతేసి నమ్మికలు నా కిచ్చెగా తాను

(॥అన్ని॥)
పెనఁగులాడితేనేమి పెచ్చు వెరిగితేనేమి
ననుపు సేసుక నాతో నవ్వెఁగా తాను
ఘనుఁడు తానె శ్రీవేంకటేశుఁడు నన్ను నేలె
చనవిచ్చి వలపులు చల్లెఁగా తాను

(||pallavi||)
anniḍānu meludānanaidi nenu
kannulam̐ jūḍam̐ga nāgum̐ galigĕm̐gā tānu

(||anni||)
yĕḍa nuṁḍinānemi yemi sesinā yemi
vāḍigado māyiṁtigi vachchĕm̐gā tānu
koḍĕgām̐ḍayidenemi gurudu luṁḍide yemi
joḍugūḍi nā mŏgamu sūsĕm̐gā tānu

(||anni||)
yĕṁtabarāgainanemi yĕvvadĕm̐ dĕchchinānemi
aṁtaraṁgamudo mām̐ṭalāḍĕm̐gā tānu
paṁtagām̐ḍayidenemi bayalīm̐diṁchide nemi
yiṁtesi nammigalu nā kichchĕgā tānu

(||anni||)
pĕnam̐gulāḍidenemi pĕchchu vĕrigidenemi
nanubu sesuga nādo navvĕm̐gā tānu
ghanum̐ḍu tānĕ śhrīveṁkaḍeśhum̐ḍu nannu nelĕ
sanavichchi valabulu sallĕm̐gā tānu