Annidaanu jaanagatte vaidive neevu

అన్నిటాను జాణకత్తె వైతివే నీవు
Language

(॥పల్లవి॥)
అన్నిటాను జాణకత్తె వైతివే నీవు
కిన్నెరమీఁటుల నెంత గిలిగించేవే

(॥అన్ని॥)
చెలువము లొకవంక చిరునవ్వు లొకవంకఁ
జిలుకుతా వల పంతచిమ్మి రేఁచేవే
తలుపవఁటున నుండి తరితీపలెల్లాఁజేసి
చెలువునియెదుటను సిగ్గు లెంతచుపవే

(॥అన్ని॥)
పొదలుఁజూపలఁ గొంత జొమ్మజం కెనలఁ గొంత
దరానఁబతి నెంతసాదించేవే
వదలుఁబయ్యదచేత వన్నేల మోవిచేత
యెదురెదురవే యంత యెలయించేవే

(॥అన్ని॥)
చిపలుఁజెమటతోడ శిరవంపలతోడ
ముపరిఁదమక మెంతమూటగటేపవే
యిప్పుడే శ్రీవేంకటేశుఁడేలె నల మేల్మంగవు
కొప జారె నింకా నెంత కొరఁజూచేవే

(||pallavi||)
anniḍānu jāṇagattĕ vaidive nīvu
kinnĕramīm̐ṭula nĕṁta giligiṁcheve

(||anni||)
sĕluvamu lŏgavaṁka sirunavvu lŏgavaṁkam̐
jilugudā vala paṁtasimmi rem̐seve
talubavam̐ṭuna nuṁḍi taridībalĕllām̐jesi
sĕluvuniyĕduḍanu siggu lĕṁtasubave

(||anni||)
pŏdalum̐jūbalam̐ gŏṁta jŏmmajaṁ kĕnalam̐ gŏṁta
darānam̐badi nĕṁtasādiṁcheve
vadalum̐bayyadaseda vannela moviseda
yĕdurĕdurave yaṁta yĕlayiṁcheve

(||anni||)
sibalum̐jĕmaḍadoḍa śhiravaṁpaladoḍa
mubarim̐damaga mĕṁtamūḍagaḍebave
yippuḍe śhrīveṁkaḍeśhum̐ḍelĕ nala melmaṁgavu
kŏba jārĕ niṁkā nĕṁta kŏram̐jūseve