అన్నిటాఁ జక్కటులే నీ వాడుకొనేవు
(॥పల్లవి॥)
అన్నిటాఁ జక్కటులే నీ వాడుకొనేవు
విన్నవారుఁ గన్నవారు వెస నిన్ను నవ్వరా
(॥అన్ని॥)
బెరసి నీవాకెమీఁదఁ బెండ్లాడినందుకు
తరుణి యేమనినానుఁదగవేకాదా
గరిమ నీవప్పటిఁగంకణము గట్టుకరాఁగా
ఇరవుగాఁ జూచి చూచి యెట్టోరిచె నీకె
(॥అన్ని॥)
కతలుగా బాసికము గట్టుకవచ్చినందుకు
సతి యేమిసేసినాను సంగతేకాదా
మితిమీర నాపెఁదొడమీఁదఁ బెట్టుకవుండఁగా
మతిలోఁ గాఁతాళించక మాననెట్టువచ్చును
(॥అన్ని॥)
కమ్మటి నాపెను నీవు కాలుదొక్కినందుకు
కొమ్మయే మెంచినా నియ్యకోలే కాదా
ఇమ్ముల శ్రీవేంకటేశ యీపె నిట్టె కూడఁగాను
నెమ్మది వెంగే లిఁక నిన్నాడవలదా
(||pallavi||)
anniḍām̐ jakkaḍule nī vāḍugŏnevu
vinnavārum̐ gannavāru vĕsa ninnu navvarā
(||anni||)
bĕrasi nīvāgĕmīm̐dam̐ bĕṁḍlāḍinaṁdugu
taruṇi yemaninānum̐dagavegādā
garima nīvappaḍim̐gaṁkaṇamu gaṭṭugarām̐gā
iravugām̐ jūsi sūsi yĕṭṭorisĕ nīgĕ
(||anni||)
kadalugā bāsigamu gaṭṭugavachchinaṁdugu
sadi yemisesinānu saṁgadegādā
midimīra nābĕm̐dŏḍamīm̐dam̐ bĕṭṭugavuṁḍam̐gā
madilom̐ gām̐tāḽiṁchaga mānanĕṭṭuvachchunu
(||anni||)
kammaḍi nābĕnu nīvu kāludŏkkinaṁdugu
kŏmmaye mĕṁchinā niyyagole kādā
immula śhrīveṁkaḍeśha yībĕ niṭṭĕ kūḍam̐gānu
nĕmmadi vĕṁge lim̐ka ninnāḍavaladā