Annidaam gaamgala panulaayam gaaga

అన్నిటాఁ గాఁగల పనులాయఁ గాక
Language

(॥పల్లవి॥)
అన్నిటాఁ గాఁగల పనులాయఁ గాక
కన్నులఁ దప్పక చూచి కాఁతాళించ నేఁటికి

(॥అన్ని॥)
చెంత నీ వాపెపై బత్తి సేయఁగాఁ జూచినదాన
పంతపు మాటలాడఁ బని యేమి
వింతయైనమట్టెలు నీవేలఁ బెట్టుకుండఁగాను
చింతతో నీకు బుద్దులు చెప్పి మరేమున్నది

(॥అన్ని॥)
గక్కన నిద్దరిమతకము నెరిఁగినదాన
దిక్కుల మీ సుద్దులు సోదించ నేల
వెక్కసపుమీగుణాలు వింతగా వినినదాన
అక్కరతో మిమ్ము నింకా నడుగఁగవలెనా

(॥అన్ని॥)
వేడుకతో మీచేత విడెము వట్టినదాన
వాడిక మీ నేర్పు తడవ నేమిటికి
యీడనె శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
జోడై నమిమ్ము మరి సొలయఁగఁ దగునా

(||pallavi||)
anniḍām̐ gām̐gala panulāyam̐ gāga
kannulam̐ dappaga sūsi kām̐tāḽiṁcha nem̐ṭigi

(||anni||)
sĕṁta nī vābĕbai batti seyam̐gām̐ jūsinadāna
paṁtabu māḍalāḍam̐ bani yemi
viṁtayainamaṭṭĕlu nīvelam̐ bĕṭṭuguṁḍam̐gānu
siṁtado nīgu buddulu sĕppi maremunnadi

(||anni||)
gakkana niddarimadagamu nĕrim̐ginadāna
dikkula mī suddulu sodiṁcha nela
vĕkkasabumīguṇālu viṁtagā vininadāna
akkarado mimmu niṁkā naḍugam̐gavalĕnā

(||anni||)
veḍugado mīseda viḍĕmu vaṭṭinadāna
vāḍiga mī nerbu taḍava nemiḍigi
yīḍanĕ śhrī veṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
joḍai namimmu mari sŏlayam̐gam̐ dagunā