అన్నిటాఁ దన్నుఁ జూచుకొమ్మనరే మీరు
(॥పల్లవి॥)
అన్నిటాఁ దన్నుఁ జూచుకొమ్మనరే మీరు
పున్నమచంద్రు వెన్నెల భూమి కెల్లాఁ గాదా
(॥అన్నిటా॥)
యెంత నన్ను బుజ్జగించి యెటువలెఁ బెట్టు కున్నా
అంతయునుఁ దనమే లనరే మీరు
పొంతనె పాదాలమీఁదఁ బూజించినపెద్దరికె
మంతట దేహన కెక్కు నదియే కాదా
(॥అన్నిటా॥)
సారె సారె దా నెంత చనవు నా కిచ్చినాను
ఆరయఁ దనలాభమో అనరే మీరు
నేరుపుతో వేళ్లపై నీళ్లెల్లాఁ బోసితేను
కూరిమినా తని వెల్లాఁ గొనలకే కాదా
(॥అన్నిటా॥)
సరి నన్నుఁ గూడి నా మైచలు వెంత వేసినాను
ఆరిది తనకె పుణ్య మనరే మీరు
యిర వై శ్రీ వేంకటేశుఁ డింత వేసి నన్నుఁ గూడె
మరిగె పండ్లతీపు మాకు వల్లఁ గాదా
(||pallavi||)
anniḍām̐ dannum̐ jūsugŏmmanare mīru
punnamasaṁdru vĕnnĕla bhūmi kĕllām̐ gādā
(||anniḍā||)
yĕṁta nannu bujjagiṁchi yĕḍuvalĕm̐ bĕṭṭu kunnā
aṁtayunum̐ daname lanare mīru
pŏṁtanĕ pādālamīm̐dam̐ būjiṁchinabĕddarigĕ
maṁtaḍa dehana kĕkku nadiye kādā
(||anniḍā||)
sārĕ sārĕ dā nĕṁta sanavu nā kichchinānu
ārayam̐ danalābhamo anare mīru
nerubudo veḽlabai nīḽlĕllām̐ bosidenu
kūriminā tani vĕllām̐ gŏnalage kādā
(||anniḍā||)
sari nannum̐ gūḍi nā maisalu vĕṁta vesinānu
āridi tanagĕ puṇya manare mīru
yira vai śhrī veṁkaḍeśhum̐ ḍiṁta vesi nannum̐ gūḍĕ
marigĕ paṁḍladību māgu vallam̐ gādā