Annidaam danagu mele yamgana yela veemgeene

అన్నిటాఁ దనకు మేలే యంగన యేల వీఁగీనే
Language

(॥పల్లవి॥)
అన్నిటాఁ దనకు మేలే యంగన యేల వీఁగీనే
మన్నించీ నాతఁడు నెమ్మది నుండుమనవే

(॥అన్ని॥)
కలికి చందురుఁ జూచి కన్నులేల మూసీనే
కలువరేకులే యివి గదవేతొల్లి
జలజాలఁబోలునని జడిసీనో యటులైతే
అలవిరహసూర్యుండు అండ నున్నాఁడుగదే

(॥అన్ని॥)
యింతి చలిగాలి చూచి యేమిటికి లోఁగీనే
అంతాఁ జందనగంద మంగమేకదే
బంతిఁ దన కారనేటిపాము వొళ్లఁ గలిగితే
దొంతరచనుఁగొండలు తోడున్నవిగదవే

(॥అన్ని॥)
కొమ్మ కోవెలకుఁగాఁ గొంకనేలే తనమోవిఁ
నుమ్మడి నామనికాల మున్నది గదే
నెమ్మది శ్రీవేంకటాద్రినిలయరాముఁ డేలితే
కిమ్ములసంగాతము సుగ్రీవ మున్నదిగదే

(||pallavi||)
anniḍām̐ danagu mele yaṁgana yela vīm̐gīne
manniṁchī nādam̐ḍu nĕmmadi nuṁḍumanave

(||anni||)
kaligi saṁdurum̐ jūsi kannulela mūsīne
kaluvaregule yivi gadavedŏlli
jalajālam̐bolunani jaḍisīno yaḍulaide
alavirahasūryuṁḍu aṁḍa nunnām̐ḍugade

(||anni||)
yiṁti saligāli sūsi yemiḍigi lom̐gīne
aṁtām̐ jaṁdanagaṁda maṁgamegade
baṁtim̐ dana kāraneḍibāmu vŏḽlam̐ galigide
dŏṁtarasanum̐gŏṁḍalu toḍunnavigadave

(||anni||)
kŏmma kovĕlagum̐gām̐ gŏṁkanele tanamovim̐
nummaḍi nāmanigāla munnadi gade
nĕmmadi śhrīveṁkaḍādrinilayarāmum̐ ḍelide
kimmulasaṁgādamu sugrīva munnadigade