అన్నిటాఁ బరిణామైతే నదే చాలును
(॥పల్లవి॥)
అన్నిటాఁ బరిణామైతే నదే చాలును
వున్నతపు సంతోసాన నున్నాఁడవా
(॥అన్నిటా॥)
అప్పుడాకెమేడలోన నంకెకు వచ్చినట్టెల్ల
చెప్పినట్టి బుద్దులెల్ల చెవిఁ బట్టెనా
దప్పిదేరే నిన్నుఁ జూచి దయదలఁచి మోవికి
కప్పుర మిచ్చినందున కాఁక దేరెనా
(॥అన్నిటా॥)
పఱపు పై ఆపె నిన్నుఁ బవ్వళించఁ జేయఁగాను
మెఱసి నిద్దిరించి మేలుకొంటివా
తఱి చూచి ఆడ నీకు తమ్ములము వెట్టఁగాను
వెఱపులెల్లఁ దీరి వేడుకాయనా
(॥అన్నిటా॥)
అట్టె కాఁగిటఁ గూడి నిన్నలయించి విసరఁగా
గట్టిగా నీమోమున కళదేరెనా
రట్టడి శ్రీవేంకటేశ గట్టిగా నన్నేలితివి
ఇట్టె యందునిందు యింపు లాయనా
(||pallavi||)
anniḍām̐ bariṇāmaide nade sālunu
vunnadabu saṁtosāna nunnām̐ḍavā
(||anniḍā||)
appuḍāgĕmeḍalona naṁkĕgu vachchinaṭṭĕlla
sĕppinaṭṭi buddulĕlla sĕvim̐ baṭṭĕnā
dappidere ninnum̐ jūsi dayadalam̐si movigi
kappura michchinaṁduna kām̐ka derĕnā
(||anniḍā||)
paṟabu pai ābĕ ninnum̐ bavvaḽiṁcham̐ jeyam̐gānu
mĕṟasi niddiriṁchi melugŏṁṭivā
taṟi sūsi āḍa nīgu tammulamu vĕṭṭam̐gānu
vĕṟabulĕllam̐ dīri veḍugāyanā
(||anniḍā||)
aṭṭĕ kām̐giḍam̐ gūḍi ninnalayiṁchi visaram̐gā
gaṭṭigā nīmomuna kaḽaderĕnā
raṭṭaḍi śhrīveṁkaḍeśha gaṭṭigā nannelidivi
iṭṭĕ yaṁduniṁdu yiṁpu lāyanā