అన్నిటా వివేకివని అందురు నిన్ను
(॥పల్లవి॥)
అన్నిటా వివేకివని అందురు నిన్ను
కన్నులఁ జూచినప్పుడే కాఁక చల్లఁ దగునా
(॥అన్ని॥)
అందరు మెచ్చఁగ నే నౌననేఁ గాదనేఁ గాని
అందము నీకయినట్లెల్ల నాడరాదా
ముందుముందే వొట్లేల ముంగోపమిది యాల
నిందలకే నామీఁద నీకింతఁ దగునా
(॥అన్ని॥)
కల్లలు నిజాలు నేనే గక్కనఁ దెలిపేఁ గాని
చెల్లినట్టెల్లా నీవు సేయరాదా
పల్లదపుఁదిట్లేల పగచాటనింత యేల
వెల్లవిరి గాక తొల్లే విరుగఁగఁ దగునా
(॥అన్ని॥)
సరవితో నీమనసు సంతసించఁ జేసేఁ గాని
తరవాతి పనులెల్లఁ దడవ రాదా
గరిమ శ్రీవేంకటాద్రి ఘనుఁడ నేఁ గూడితిని
తిరముగ గోరనూఁది గొణఁగఁ దగునా
(||pallavi||)
anniḍā vivegivani aṁduru ninnu
kannulam̐ jūsinappuḍe kām̐ka sallam̐ dagunā
(||anni||)
aṁdaru mĕchcham̐ga ne naunanem̐ gādanem̐ gāni
aṁdamu nīgayinaṭlĕlla nāḍarādā
muṁdumuṁde vŏṭlela muṁgobamidi yāla
niṁdalage nāmīm̐da nīgiṁtam̐ dagunā
(||anni||)
kallalu nijālu nene gakkanam̐ dĕlibem̐ gāni
sĕllinaṭṭĕllā nīvu seyarādā
palladabum̐diṭlela pagasāḍaniṁta yela
vĕllaviri gāga tŏlle virugam̐gam̐ dagunā
(||anni||)
saravido nīmanasu saṁtasiṁcham̐ jesem̐ gāni
taravādi panulĕllam̐ daḍava rādā
garima śhrīveṁkaḍādri ghanum̐ḍa nem̐ gūḍidini
tiramuga goranūm̐di gŏṇam̐gam̐ dagunā