Annidaa samtosame amduge meerevayya

అన్నిటా సంతోసమె అందుకే మీరేవయ్య
Language

(॥పల్లవి॥)
అన్నిటా సంతోసమె అందుకే మీరేవయ్య
మన్ననతో నీ వెంత మరిగించినాను

(॥॥)
యెగ్గు పట్ట బుద్ధి గాదు యిచ్చకురాలఁ గనక
దిగ్గన నీ వేవనితఁ దెచ్చుకొన్నను
సిగ్గువడ బుద్ది గాదు సేవకురాలఁ గనక
వొగ్గి నీ వెంత పచ్చిగ నుదుటు లాడినను

(॥॥)
ఱట్టు సేయ బుద్ది గాదు చుట్టపుదానఁ గనక
తొట్టి మరి నీ వెవ్వరితోడ నవ్వినా
గుట్టు చూప బుద్ది గాదు కూడిమాడి వుందుఁగాక
నెట్టన నేడ సుద్దులు నీ వడిగినాను

(॥॥)
వింత సేయ బుద్ది గాదు వేడ్కలో సతిఁగనక
సంత కూటములను వేసాలు సేసేనా
ఇంతలో శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి
పంతమాడ బుద్ది గాదు పక్కన మెచ్చినాను

(||pallavi||)
anniḍā saṁtosamĕ aṁduge mīrevayya
mannanado nī vĕṁta marigiṁchinānu

(||||)
yĕggu paṭṭa buddhi gādu yichchagurālam̐ ganaga
diggana nī vevanidam̐ dĕchchugŏnnanu
sigguvaḍa buddi gādu sevagurālam̐ ganaga
vŏggi nī vĕṁta pachchiga nuduḍu lāḍinanu

(||||)
ṟaṭṭu seya buddi gādu suṭṭabudānam̐ ganaga
tŏṭṭi mari nī vĕvvaridoḍa navvinā
guṭṭu sūba buddi gādu kūḍimāḍi vuṁdum̐gāga
nĕṭṭana neḍa suddulu nī vaḍiginānu

(||||)
viṁta seya buddi gādu veḍkalo sadim̐ganaga
saṁta kūḍamulanu vesālu sesenā
iṁtalo śhrī veṁkaḍeśha yiṭṭe nannu nelidivi
paṁtamāḍa buddi gādu pakkana mĕchchinānu