(॥పల్లవి॥)
అన్నిటా పంతగత్తెవైతేనేమి
సన్నలనే మోవిచూపి చవిగొనఁ గదవే
(॥అన్ని॥)
చలము లేమిటికే సాదించనేమిటికే
వలపులఁ బెనగొన్నవనితవు
పిలిచీ నిన్నతఁడు ప్రియముచెప్పీనతఁడు
మలసి యలుకలెల్లా మానవే యింతటను
(॥అన్ని॥)
పంతములాడఁగనేలే బలిమిచూపఁగనేలే
చెంతలఁ బెండ్లాడిన చెలియవు
కంతుని గురుఁడతఁ డక్కరైన పతి యతఁడు
చింతలెల్లఁ దీర సేవసేయవే యింతటను
(॥అన్ని॥)
కేరలించే విదేమే గేలిసేసేవేమే
మరిగినయలమేలుమంగవు నీవు
సిరిగలవాఁ డతఁడు శ్రీవేంకటేశుఁ డతఁడు
నిరతిఁ గూడితి వింపు నించవే యింతటను
(||pallavi||)
anniḍā paṁtagattĕvaidenemi
sannalane movisūbi savigŏnam̐ gadave
(||anni||)
salamu lemiḍige sādiṁchanemiḍige
valabulam̐ bĕnagŏnnavanidavu
pilisī ninnadam̐ḍu priyamusĕppīnadam̐ḍu
malasi yalugalĕllā mānave yiṁtaḍanu
(||anni||)
paṁtamulāḍam̐ganele balimisūbam̐ganele
sĕṁtalam̐ bĕṁḍlāḍina sĕliyavu
kaṁtuni gurum̐ḍadam̐ ḍakkaraina padi yadam̐ḍu
siṁtalĕllam̐ dīra sevaseyave yiṁtaḍanu
(||anni||)
keraliṁche videme geliseseveme
mariginayalamelumaṁgavu nīvu
sirigalavām̐ ḍadam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍadam̐ḍu
niradim̐ gūḍidi viṁpu niṁchave yiṁtaḍanu