Annidaa ninnu mechcheyamtavaaramaa

అన్నిటా నిన్ను మెచ్చేయంతవారమా
Language

(॥పల్లవి॥)
అన్నిటా నిన్ను మెచ్చేయంతవారమా
మన్నించు మంటిమి మమ్ము మఱవకు మిఁకను

(॥అన్ని॥)
నీవే నేరుతువు నిజాలు నిలువఁబెట్టి
మావంటివారు నీతో మాటలాడేరా
కావలసినపనులు కలిగినట్టె అయ్యీని
దేవుఁడవు నీకు మొక్కేఁదెలుసుకో నీవే

(॥అన్ని॥)
అలవాటు గద్దు నీకు నందరిని భ్రమయించ
చలపట్టి నీతోను సరివారమా
వలపుగలవారికి వాసు లెంచ నున్నదా
కొలువు సేసేము మాకోరికె నీచేతిది

(॥అన్ని॥)
అంతవాఁడ వౌదువు ఆయములు గరఁగించ
పంతముల నిన్ను మీరేపనులున్నవా
చెంతల శ్రీవేంటేశ చేకొని కూడిని నన్ను
యింతయు నీ మహిమలే యిరవాయఁ బనులు

(||pallavi||)
anniḍā ninnu mĕchcheyaṁtavāramā
manniṁchu maṁṭimi mammu maṟavagu mim̐kanu

(||anni||)
nīve neruduvu nijālu niluvam̐bĕṭṭi
māvaṁṭivāru nīdo māḍalāḍerā
kāvalasinabanulu kaliginaṭṭĕ ayyīni
devum̐ḍavu nīgu mŏkkem̐dĕlusugo nīve

(||anni||)
alavāḍu gaddu nīgu naṁdarini bhramayiṁcha
salabaṭṭi nīdonu sarivāramā
valabugalavārigi vāsu lĕṁcha nunnadā
kŏluvu sesemu māgorigĕ nīsedidi

(||anni||)
aṁtavām̐ḍa vauduvu āyamulu garam̐giṁcha
paṁtamula ninnu mīrebanulunnavā
sĕṁtala śhrīveṁṭeśha segŏni kūḍini nannu
yiṁtayu nī mahimale yiravāyam̐ banulu